Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళలు వారి కుటుంబాల జీవితాలను వృద్ధి చేసిన గోల్డ్ డ్రాప్
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి లోహియా ఎడిబల్ ఆయిల్ వద్ద సమ్మిళిత ఉద్యోగావకాశాలను అందించడం ద్వారా మహిళలు మరియు వారి కుటుంబాల జీవితాలను గోల్డ్ డ్రాప్ వృద్ధి చేసింది. సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ మితేష్ లోహియా మాట్లాడుతూ ‘‘తాము కార్యకలాపాలు ప్రారంభించిన నాటినుంచి మహిళలు మరియు వారి కుటుంబాలలో వెలుగులు తీసుకురావడానికి గోల్డ్ డ్రాప్ వద్ద ప్రయత్నిస్తూనే ఉన్నాం. సమ్మిళిత పనివాతావరణం కల్పించినప్పుడు మాత్రమే మంచి అన్నది సాధ్యమవుతుంది. భారతదేశ వ్యాప్తంగా లింగ వివక్షత అనేది ఉద్యోగాలలో ఉందని మాకు తెలుసు కానీ మేము ఈ అంతరాన్ని వీలైనంతగా తగ్గించడం ద్వారా చేయగలిగింనంతగా మంచిని చేయగలుగుతున్నాము. మా సిబ్బందిలో చాలామంది మా ఫ్యాక్టరీ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వ్యక్తులు. మా సిబ్బందిలో మహిళలు ఎక్కువగా ప్యాకేజింగ్ విభాగంలో పనిచేస్తుంటారు. అతి తక్కువ శబ్దం, వేడి, ధూళి రహిత వాతావరణం అక్కడ ఉంటుంది. దీని వల్ల వారు కంపెనీ కార్యకలాపాలలో అత్యంత కీలకమైన ప్యాకేజింగ్ విభాగంలో పూర్తి శ్రద్ధతో కార్యకలాపాలు చేసేందుకు వీలు కలుగుతుంది’’ అని అన్నారు. గోల్డ్ డ్రాప్ వద్ద వినియోగదారుల భద్రత అత్యంత కీలకమైన అంశం. ఈ ప్యాక్లన్నీ కూడా టాంపర్ ఫ్రూఫ్ సీల్స్ కలిగి ఉంటాయి. ప్యాకేజింగ్,స్టోరేజీని పూర్తి ఆరోగ్యవంతమైన ప్రమాణాలలో చేయడం ద్వారా వినియోగదారుల పట్ల సంస్థ నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది.