Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఈ-కామర్స్ రంగంలోని నిహార్ ఇన్ఫో గ్లోబల్ కొత్తగా మూడు అనుబంధ కంపెనీలను ఏర్పాటు చేసినట్టు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో 8 హెక్టార్లలో బెరైటీస్, డోలమైట్ క్వారీని 20 ఏళ్లపాటు లీజుకు తీసుకున్న ఒక మైనింగ్ సంస్థలో నిహార్ మైనింగ్ 45శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపింది. సోలార్ సిస్టమ్స్, ఇతర ఉత్పత్తుల తయారీ, ట్రేడింగ్, దిగుమతులు, ఎగుమతుల వ్యాపారాన్ని నిహార్ రెనివేబుల్ ఎనర్జీ చేపట్టనుందని నిహార్ ఇన్ఫో గ్లోబల్ ఎండి బి దివ్యేశ్ నిహార్ తెలిపారు. లైఫ్ 108 హెల్త్‌కేర్ ఔషధాలు, సౌందర్య సాధనాలు, ఫిట్నెస్, ఆరోగ్య సంబంధ పరికరాలు, డైటరీ సప్లిమెంట్లను ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో విక్రయించనుందన్నారు.