Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోల్నుపిరవిర్ మాత్రల ఆవిష్కరణ
హైదరాబాద్ : వచ్చే ఐదేండ్లలో రూ.1500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్టు ఆప్టిమస్ ఫార్మా ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కంపెనీ సామర్థ్యం పెంపునకు ప్రతీ ఏడాది రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు వ్యయం చేయనున్నామన్నారు. గురువారం హైదరాబాద్‌లో ఆ కంపెనీ అభివృద్థి చేసిన కోవిడ్-19 నిరోధక ఔషధమైన మోల్నుపిరవిర్‌ను శ్రీనివాస్ రెడ్డి భారత మార్కెట్లోకి విడుదల చేశారు. దీని అత్యవసర వినియోగానికి ఇప్పటికే డీసీజీఐ ఆమోదం లభించిందన్నారు. దేశంలోని 29 భౌగోళిక అధ్యయన అంశాలకు సంబంధించి 1218 విషయాలపై ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్‌ని విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ఐదు రోజుల చికిత్సకు ఉద్దేశించి 10 మాత్రల ధరలను రూ.630గా నిర్ణయించామన్నారు. ఈ మాత్రల పరిశోధన, అభివృద్థి కోసం రూ.30 కోట్లు (4 మిలయన్ డాలర్లు) వెచ్చించామన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.1200 కోట్ల ఆదాయాన్ని నమోదు చేశామన్నారు. ఇందులో ఎగుమతుల వాటా సగం ఉందన్నారు. 40 దేశాలకు పైగా ఎగుమతులు కలిగి ఉన్నామన్నారు. ప్రతీ ఏడాది సటటున 15-20 శాతం వృద్థిని సాధిస్తున్నామన్నారు. దీర్ఘకాలంలో ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు వచ్చే యోచనలో ఉన్నామన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో మూడు, విశాఖపట్నంలో ఒక్క ఉత్పత్తి ప్లాంట్లను కలిగి ఉన్నామన్నారు.