Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : డిజిటల్ కన్జూమర్ క్రెడిట్ విభాగంలో భారతదేశంలోనే అతిపెద్ద మార్కెట్ ప్లేస్ అయిన పైసాబజార్.కామ్ తాజాగా యాక్సిస్ బ్యాంకుతో తన బంధాన్ని మరింత పటిష్టం చేసుకుంటూ కీలక ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా ప్రైవేటు రంగంలో దేశంలోనే అతిపెద్ద మూడో బ్యాంకు అయిన యాక్సిస్ బ్యాంకు ప్రీ-క్వాలిఫైడ్ అన్ సెక్యూర్డ్ రుణాలు ఇక మీదట పైసాబజార్.కామ్ ఫ్లాట్‌ఫాం ద్వారా అందించనుంది. ప్రీ క్వాలిఫైడ్ రుణాలు నేరుగా బ్యాంకులతో ఒప్పందం చేసుకుని అందించడం ద్వారా పైసాబజార్.కామ్ కు ఉన్న డీప్ టెక్నాలజీ, మరియు అనలిటిక్స్ సమర్ధతకు అద్దం పడుతుంది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, బ్యాంకులు ఈ ప్రీ-క్వాలిఫైడ్ అన్ సెక్యూర్డ్ రుణాలు ఈ ఫ్లాట్ ఫాం ద్వారా అందించడం గొప్ప విషయం. యాక్సిస్ బ్యాంక్ ఖాతాదారులు ముఖ్యంగా వేతన జీవులు, ఇటు స్వయం ఉపాధి విభాగానికి చెందిన ఇద్దరూ కూడా ప్రీక్వాలిఫైడ్ పర్సనల్ రుణాలను పైసాబజార్.కామ్ ఫ్లాట్ ఫాంలో కూడా ఆఫర్లు చూసుకుని ధరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకులో ఖాతాదారులకు లభించే ఆఫర్లు ఇక మీదట పైసాబజార్.కామ్ ఫ్లాట్ ఫాంలో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ సదుపాయం వల్ల కస్టమర్లకు తక్షణ రుణ సదుపాయంలో ఎండ్ టు ఎండ్ డిజిటల్ ప్రాసెస్ అవుతుంది. పైసా బజార్లో కొన్ని బటన్స్ క్లిక్ చేస్తే చాలు మొత్తం ప్రక్రియ కొద్ది నిమిషాల్లో పూర్తి అవుతుంది.
‘‘పైసాబజార్.కామ్‌తో భాగస్వామ్యం సౌకర్యవంతంగా మరియు సులభంగా ఉంటుంది, దీని వల్ల వినూత్న మార్గాల్లో ఫైనాన్షియల్ సొల్యూషన్స్ చూపించడంతో పాటు కస్టమర్లకు మెరుగైన అనుభవాలను అందించే దిశగా మరో అడుగు పడింది. ప్రీ- క్వాలిఫైడ్ క్రెడిట్ ఉత్పత్తుల్లో పేపర్‌లెస్ ప్రక్రియతో పాటు చెల్లింపులు అత్యంత వేగంగా జరుగుతాయి. నేరుగా బ్యాంకు ద్వారా ప్రీ-క్వాలిఫైడ్ ఉత్పత్తులతో ఎలాగైతే వినియోగదారులకు మెరుగైన సేవలు అందుతున్నాయో అదే ఆనందమయైన సర్వీసులు ఇక మీదట పైసాబజార్.కామ్‌లో కూడా అందుబాటులోకి వచ్చాయి” అని అన్నారు సుమిత్ బాలి, గ్రూప్ ఎగ్జిక్యూటివ్ మరియు హెడ్ – రీటైల్ & లెండింగ్, యాక్సిస్ బ్యాంక్. ‘‘మార్కెట్ లీడర్‌గా వైవిధ్యమైన వినియోగదారుల విభాగాల్లో మా ప్లాట్‌ఫామ్ ద్వారా ఇండస్ట్రీ బెస్ట్ ప్రోడక్టులు అందిస్తుంది. యాక్సిస్ బ్యాంక్‌తో మా భాగస్వామ్యాన్ని పెంచుకోవడం ద్వారా వారి కస్టమర్ బేస్ క్రెడిట్ విభాగాన్ని సులభతరం చేయడం, అలే రుణ ప్రక్రియను సరళతరం చేస్తున్నాము. వినియోగదారులకు సౌకర్యవంతంగా మరియు ఎలాంటి సంక్లిష్టతలు లేకుండా చేయడమే మా లక్ష్యం‘‘ అని తెలిపారు నవీన్ కుక్రేజా, సీఈఓ & కో-ఫౌండర్, పైసాబజార్.కామ్. పైసాబజార్ గడిచిన కొన్నేళ్లుగా ముఖ్యంగా మహమ్మారి అనంతరం డిజిటల్ సామర్ధ్యాలపై దృష్టి పెట్టి కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఇందుకోసం మౌలిక సదుపాయాలపైనా దృష్టి పెట్టింది. యాక్సిస్ బ్యాంకు వంటి పెద్ద పెద్ద బ్యాంకులు, ఇతర బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల ఒప్పందాలతో సరికొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ఇందులో భాగంగానే పెద్ద బ్యాంకులు మరియు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలతో పైసాబజార్.కామ్ ప్రీ-అప్రూవ్డ్ మరియు ప్రీ-క్వాలిఫైడ్ ప్రోగ్రామ్‌లు అందించడంతో కోసం క్రెడిట్ హిస్టరీ, డేటా, డిజిటల్ ఇన్నోవేషన్ వంటి సదుపాయాలు సమకూర్చకుంది.