Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2021లో 22 శాతం ర్యాలీ
- చివరి రోజూ లాభాలతో ముగింపు
ముంబయి : గడిచిన ఏడాదిలో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను ఆర్జించాయి. వాహన, విత్త, ఎఫ్ఎంసిజి రంగాల ప్రధాన మద్దతుతో 2021 ఏడాది చివరి రోజూ సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లో ముగిశాయి. ఏడాది కాలంలో సెన్సెక్స్ 22 శాతం లేదా 10,503 పాయింట్లు పెరిగింది. 2021 అక్టోబర్ 19న 62,245కి చేరి ఆల్‌టైం రికార్డ్ స్థాయిని నమోదు చేసింది. కరోనా సంక్షోభ కాలంలోనూ మార్కెట్లు రాణించాయని యాక్సిస్ అసెట్ మేనేజ్మెంట్ ఎండీ, సీఈఓ చంద్రేష్ నిగమ్ పేర్కొన్నారు. ప్రథమార్థంలో ఆర్థిక వ్యవస్థ రికవరీ మద్దతునివ్వగా.. ద్వితీయార్థంలో ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్లు మార్కెట్లకు ఉత్సాహాన్ని ఇచ్చాయన్నారు. వారాంతం సెషన్లో ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా అదే హోరును కొనసాగించాయి. వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ పెంపు వాయిదా కూడా మార్కెట్లకు మద్దతునిచ్చింది. తుదకు సెన్సెక్స్ 459.50 పాయింట్లు పెరిగి 58,253.82కు చేరింది. నిఫ్టీ 150 పాయింట్లు రాణించి 17,354 వద్ద ముగిసింది.