Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో గడిచిన ఏడాది 2021లో విలువ, సంఖ్యా పరంగా రికార్డ్ స్థాయిలో యునిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యుపిఐ) చెల్లింపులు నమోదయ్యాయి. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పిసిఐ) గణంకాల ప్రకారం.. ఒక్క ఏడాదిలోనే 3800 కోట్ల లావాదేవీలు జరగ్గా.. వీటి విలువ 73.36 లక్షల కోట్లుగా ఉంది. గడిచిన ఆర్థిక సంవత్సరం (2020-21)లో 220 కోట్ల లావాదేవీలు జరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇవి 4000-4200 కోట్ల లావాదేవీలు జరుగొచ్చని ఎన్పిసిఐ అంచనా. దేశంలో 2016లో యుపిఐ లావాదేవీలు ప్రారంభమయ్యాయి. గడిచిన డిసెంబర్ మాసంలో రూ.8.27 లక్షల కోట్ల విలువ చేసే 456 వేల కోట్ల లావాదేవీలు చోటు చేసుకున్నాయి. ఇంతక్రితం నవంబర్ లావాదేవీలతో పోల్చితే ఏకంగా 99 శాతం పెరిగాయి.