Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ సంస్థల్లో అత్యధిక మార్కెట్ కాపిటలైజేషన్ కలిగిన ఒఎన్జిసి ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి) పోస్టు ఖాళీగా ఉంది. గతేడాది ఏప్రిల్ నుంచి ఒఎన్జిసి ఫైనాన్స్ డైరెక్టర్ సుభాష్ కుమార్ ఈ అదనపు బాధ్యతల్లో ఉన్నారు. డిసెంబర్ 31తో ఆయన పదవీకాలం ముగిసింది. మోడీ ప్రభుత్వం అత్యంత కీలకమైన ఈ కంపెనీకి సిఎండిని నియమించకపోవడం గమనార్హం. కాగా ఆన్షోర్ డైరెక్టర్గా ఉన్న అనురాగ్ శర్మకు అదనపు బాధ్యతలు అప్పగించారని ఒఎన్జిసి శనివారం స్టాక్ మార్కెట్లకు సమాచారం ఇచ్చింది. కాగా.. సిఎండి బాధ్యతలను ఎవరికి అప్పగించేది ఇప్పటికీ కేంద్రం నిర్ణయించలేదు. ఈ నియామకానికి సంబంధించి పబ్లిక్ సెక్టార్ బోర్డు రెండు, మూడు నెలల ముందు నుంచే కసరత్తు చేయాల్సి ఉంటుంది. కానీ అలా చేయలేదని స్పష్టమవుతోంది. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడంలో ఇదోరకమైన కుట్ర అని విమర్శలు వస్తున్నాయి.