Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నయ్: ప్రముఖ బైకుల తయారీ కంపెనీ ఇండియా యమహా మోటార్ (వైఎంఐ) సోమవారం భారత మార్కెట్లోకి ఎఫ్జడ్ఎస్-ఎఫ్ఐ డిక్స్ మోడల్‌ను విడుదల చేసింది. జనవరి రెండో వారం నుంచి దీన్ని డెలివరీ చేయనున్నట్లు ప్రకటించింది. 140 సిసి ఇంజిన్‌తో దీన్ని ఆవిష్కరించింది. ఇందులో ఎఫ్జడ్ఎస్-ఎఫ్ఐ డిఎల్ఎక్స్ ధరను రూ.1,18,900గా, ఎఫ్‌జడ్-ఎస్ఎఫ్ఐ ధరను రూ.1,15,900గా నిర్ణయించింది. తమ వినియోగదారుల అవసరాలను తీర్చేలా ఈ బైకును రూపొందించామని ఆ కంపెనీ ఛైర్మన్ ఐషిన్ చిహనా పేర్కొన్నారు. ఈ మూడో తరం బైకు భారత యువతను విశేషంగా ఆకర్షిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.