Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెన్సెక్స్ 929 పాయింట్ల ర్యాలీ
ముంబయి : కొత్త ఏడాది తొలి సెషన్లో దేశీయా స్టాక్ మార్కెట్లు జోష్తో ప్రారంభమయ్యాయి. డిసెంబర్లో తయారీ రంగం పుంజుకుందన్న గణంకాల సూచీలు ప్రధాన మద్దతును అందించాయి. అన్ని ప్రధాన రంగాల సూచీలు రాణించడంతో తుదకు బిఎస్ఇ సెన్సెక్స్ 929 పాయింట్లు పెరిగి 59,183కు చేరింది. ఇంట్రాడేలో 59,266 గరిష్ట స్థాయిని తాకింది. సెన్సెక్స్-30లో 26 స్టాక్స్ కూడా లాభాలను గడించాయి. ఇదే బాటలో ఎన్ఎస్ఇ నిఫ్టీ 272 పాయింట్లు రాణించి 17,626 వద్ద ముగిసింది. కోల్ ఇండియా అత్యధికంగా 9 శాతం పెరిగింది. ఐచర్ మోటర్స్, ఐసిఐసిఐ బ్యాంక్, టాటా మోటార్స్, ఇండుస్ఇండ్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ సూచీలు అధికంగా లాభపడిన వాటిలో ఉన్నాయి.