Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: యూజ్డ్ కార్ కొనుగోలుదారులకు కార్ ఫైనాన్సింగ్, వేగవంతమైన, ఇబ్బందుల్లేని, స్ట్రీమ్ లైన్డ్ షాపింగ్ అనుభూతిని అందించేందుకు వీలుగా ప్రి-ఓన్డ్ వాహనాలకు అగ్రగామి ఇ-కామర్స్ వేదిక అయిన కార్స్ 24 బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ తో కలసి పని చేస్తోంది. 2021 డిసెంబర్ లో యూజ్డ్ కార్స్ ఇ-కామర్స్ అగ్రగామి – కార్స్ 24 సిరీస్ జి ఫండింగ్ కింద 400 మిలియన్ డాలర్లను సేకరించింది. దేశంలో ప్రి-ఓన్డ్ కార్లకు డిమాండ్ ఆకాశాన్ని అంటుతున్నా, యూజ్డ్ కార్లకు ఫైనా న్సింగ్ మాత్రం 15శాతంగానే ఉంది. కారు కొనడంలో ఫైనాన్సింగ్ కీలక పాత్ర వహిస్తుంది. దీన్ని గుర్తించిన కార్స్ 24, బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ కొనుగోలుదారులకు వారి ఆర్థిక సరళత్వాన్ని మెరుగుపరుస్తున్నాయి. కారును సొంతం చేసుకునే అవకాశాలను మరింత అధికం చేస్తున్నాయి.
ఈ సందర్భంగా కార్స్ 24 సహ వ్యవస్థాపకుడు, సీఎఫ్ఒ రుచిత్ అగర్వాల్ మాట్లాడుతూ, ‘‘కార్స్ 24 పరిశ్రమ రూపురేఖలను తిరగరాయనుంది. కొనుగోలుదారులకు తిరుగులేని ఫైనాన్సింగ్ ఆప్షన్లు అందించడంపై దృష్టి పె ట్టడం ద్వారా, కారు సొంతం చేసుకోవాలనుకునే మరెంతో మంది భారతీయుల కలను నిజం చేయాలనే ఆశ యంతో మేమున్నాం. ఈ ప్రక్రియలో, బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ తో భాగస్వామ్యం మార్కెట్ కు సరిపోయే పరి పూర్ణ ఉత్పాదనగా ఉంటుందని మేం విశ్వసిస్తున్నాం. బీఎఫ్ఎల్ తో కలసి కార్స్ 24 కారు కొనడాన్నిసులభం చేస్తోంది. అధిక నాణ్యమైన కస్టమర్ అనుభూతులను అందిస్తోంది. కొనుగోలుపై నియంత్రణను కొనుగోలుదా రుకు అందిస్తోంది’’ అని అన్నారు.
ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ డిప్యూటీ సీఈఓ అనుప్ షా మాట్లాడుతూ, ‘‘సులభమైన, తేలిగ్గా పొందగల ఫైనాన్స్ పరిష్కారం అందించడం బజాజ్ ఫైనాన్స్ లో కీలకంగా ఉంటుంది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత మందికి యూజ్డ్ కార్లకు ఫైనాన్సింగ్ చేసేందుకు వీలు కల్పిస్తుంది. యూజ్డ్ కార్ ఫైనాన్సింగ్ విభాగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని మేం విశ్వసిస్తున్నాం. సరైన ఫైనాన్సింగ్ అవకాశా లు మాత్రమే కొనుగోలుదారులకు వారు సరైన నిర్ణయాలు తీసుకునేందుకు తోడ్పడుతాయి. కొనుగోలుదారు లు ఇప్పుడు వేగవంతమైన అప్రూవల్స్, తక్కువ డాక్యుమెంటేషన్, విలువ జోడించబడిన సేవలు, ఆఫర్లతో తిరుగు లేని కొనుగోలు అనుభూతిని పొందగలుగుతారు’’ అని అన్నారు.
కార్స్ 24 ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రై.లి. అనేది కార్స్ 24 సర్వీసెస్ ప్రై.లి. పూర్తిస్థాయి అనుబంధ సంస్థ. యూజ్డ్ కార్ల కొనుగోలుదారులకు ఇది రుణసదుపాయాలు కల్పిస్తూ, కొనడాన్ని తేలికైంది, సురక్షితమైందిగా, వేగవంతమైందిగా చేస్తుంది. ఉభయతారకమైన ఈ భాగస్వామ్యం యూజ్డ్ కార్డ్ పరిశ్రమలోకి మరింతగా చొచ్చుకెళ్లేందు కు తోడ్పడుతుంది. కొనుగోలుదారులు బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఆర్థిక పరిష్కారాలతో కార్స్ 24 ఇబ్బంది రహిత అనుభవాన్ని పొందేందుకు ఇది వీలు కల్పిస్తుంది.