Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రయివేటు రంగంలోని హెచ్డిఎఫ్సి బ్యాంకు తాజాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (సిబిఐసి)తో కీలక భాగస్వామ్యం కుదర్చుకుంది. దీనితో ఎగుమతి, దిగుమతిదారులు హెచ్డిఎఫ్సి బ్యాంకును ఎంపిక చేసుకోవడం ద్వారా నేరుగా కస్టమ్స్ డ్యూటీ చెల్లించడానికి వీలుందని ఆ బ్యాంక్ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రిన్సిపల్ చీఫ్ కంట్రోలర్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ సిబిఐసి వారు ధవీకరించిన అనంతరం సరుకులు అలాగే సేవల దిగుమతి, ఎగుమతికి ఐజిఎస్టి సేకరించనున్నట్లు పేర్కొంది. సిబిఐసిలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ చేరికతో వినియోగదారులకు ఇతర బ్యాంకు ఖాతాల నుంచి చెల్లింపులను బదిలీ చేసే అవసరం ఉండదని తెలిపింది.