Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : హెయుఎల్ వారి హార్లిక్స్ ఉమెన్స్ ప్లస్ ఇటీవల అపోలో క్లినిక్స్ భాగస్వామ్యంలో ఒక నెల రోజులు విటమిన్ డి కొరత మరియు ఎముకల ఆరోగ్యం గురించి మహిళల్లో జాగృతి కల్పించేందుకు ముందుకు వచ్చింది. ఈ రెండు సంస్థలూ ఎముకల ఆరోగ్యం గురించి జాగృతి కల్పించేందుకు ఒక్కతాటిపైకి రాగా, గరిష్ఠ పౌష్ఠికత, దైహిక వ్యాయామం మరియు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడాన్ని ఉత్తేజించనున్నారు. ఈ జాగృతి సమయంలో హార్లిక్స్ ఉమెన్స్ ప్లస్ మరియు అపోలో క్లినిక్ 30 ఏళ్లు పైబడిన మహిళలు అందరికీ హైదరాబాద్, ఢిల్లీ, ముంబయి, పుణె, కోల్కత్తా, బెంగళూరు మరియు చెన్నైలలోని అన్ని అపోలో క్లినిక్లలో ఉచిత విటమిన్ డి పరీక్షను చేసేందుకు భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. ఈ పరీక్షతో పాటు వైద్యుల నుంచి ఉచిత ఆరోగ్య సలహానూ పొందవచ్చు.
భారతదేశంలో 10 మందిలో 9 మందికి విటమిన్ డి కొరత ఉంది. మహిళల్లో 30 ఏళ్ల అనంతరం ఎముకల సాంద్రత తగ్గడం మొదలవుతుంది. దీనితో క్రమం తప్పకుండా చేసే పనుల సందర్భంలో అంటే, ఎక్కువ సమయం నిలబడి ఉన్నప్పుడు, వంగేటప్పుడు, మోకాలు వంచేటప్పుడు లేదా భారమైన వస్తువులను ఎత్తే సమయంలో పదే పదే నొప్పి కలుగుతుంది. రోగాన్ని అడ్డకునేందుకు చర్యలు తీసుకోకుండా ఉంటే ఇది ఎముకల నొప్పి, ఎముకలు విరగడం మరియు వృద్ధాప్యంలో ఆస్టియోపోరోసిస్ సమస్యలు ఎదురవుతాయి. విటమిన్ డి మీ ఎముకలకు అత్యంత ముఖ్యమైనది కాగా, అది క్యాల్షియంను పీల్చుకుంటుంది, అయితే భారతదేశంలో దురదృష్టవశాత్తు దీని గురించి జాగృతి చాలా తక్కువగా ఉంది. సమతుల్యత కలిగిన ఆహారం, క్రమం తప్పకుండా దైహిక వ్యాయామం మరియు ప్రొటీన్, మెగ్నీషియం, క్యాల్షియం, విటమిన్ కె2 మరియు విటమిన్ డి తదితర ప్రముఖ పోషకాంశాలను తీసుకోవడం ద్వారా ఎముకలు దృఢంగా ఉంచేందుకు, సౌఖ్యతకు అత్యంత అవసరం. హార్లిక్స్ ఉమెన్స్ ప్లస్ 6 నెలల్లో 100% క్యాల్షియంలోని ఆర్డిఏ, విటమిన్ డి మరియు విటమిన్ కె2 అవసరమని క్లినికల్లీ రుజువైంది. హిందూస్తాన్ యూనిలివర్ లిమిటెడ్ న్యూట్రిషన్ విభాగం ఉపాధ్యక్షుడు కృష్ణన్ సుందరం మాట్లాడుతూ, భారతదేశంలో స్వాస్థతకు సంబంధించిన సంస్కృతిని ఉత్తేజించే ఉద్దేశంతో మహిళల ఆరోగ్య మార్కెట్లో నాయకునిగా ఉన్న హెచ్యుఎల్ ఇప్పుడు అపోలో గ్రూపుతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకోవడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. గరిష్ఠ పౌష్ఠికత, దైహిక వ్యాయామం మరియు క్రమం తప్పకుండా కొన్ని పరీక్షలను చేయించుకోవడాన్ని అలవాటు చేసుకోవడం గురించి జాగృతిని కల్పించనుంది. మేము ఈ ప్రయాణాన్ని జాయింట్ అవేర్నెస్ క్యాంపెయిన్ ఆన్ హార్లిక్స్ ఉమెన్స్ ప్లస్ భాగస్వామ్యంలో ప్రారంభిస్తుండగా, అది ఎముకల ఆరోగ్యపు పౌష్ఠికత పానీయంగా హార్లిక్స్ పోర్ట్ ఫోలియోలో క్లినికల్లీ రుజువైంది. ఇది జాగృతి స్థాయిలో మార్పును తీసుకు రాగలదు మరియు భారతదేశంలో విటమిన్ డి కొరత భారాన్ని తగ్గిస్తుంది అని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 18000ం మహిళలు ఈ అభియాన్లో పరీక్ష చేయించుకున్నారు. ఈ జాగృతి హార్లిక్స్ ఉమెన్స్ ప్లస్ విశ్వసనీయతలో అపార విజయాన్ని దక్కించుకోగా, అది విటమిన్ డి కొరత మరియు ఎముకల ఆరోగ్యం గురించి జాగృతి కల్పించడంలో గమనార్హమైన మార్పు తీసుకు వచ్చింది. ఇది భారత దేశంలో ఆరోగ్యం మరియు రోగాన్ని అడ్డుకునే ఆరోగ్య సేవలను ఉత్తేజించడంలో కీలకంగా వ్యవహరించనుంది