Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, తమిళనాడులలో ఏషియన్ పెయింట్స్ అల్టిమా ప్రొటెక్ కోనం 2020లో టీవీసీ ని ఎక్స్ క్లూజి వ్ గా ఆవిష్కరించిన తరువాత ఈ బ్రాండ్ సరికొత్త కమర్షియల్ తో వచ్చిం ది. భారతదేశం అభిమా నించే స్టాండప్ కామెడియన్లలో ఒకరైన అలెగ్జాండర్ బాబు ఇందులో ద్విపాత్రాభిన యంతో అలరిస్తారు. ఈ నూతన ఫిల్మ్ లో, గతంలో అల్టిమా ప్రొటెక్ టీవీసీ నటించి దాని విజయంలో భాగ స్వాములైన భగవతి పెరుమాళ్ వంటి వారు కూడా నటించారు. వీక్షకులు ఇప్పుడు పూర్తిగా కొత్త అవ తారంలో వారిని చూడ వచ్చు. పెరిగిపోతున్న అంతర్జాతీయ ఉష్ణోగ్రతలు వాతావరణ ధోరణులను ఊహించలేనవిగా చేశాయి. ఓ ఇంటి బయటి గోడలు ఎన్నో రకాల వాతావరణ మార్పులకు గురవుతుంటాయి. భారీ వర్షాలకు, మండే ఎండ లకూ లోనవుతుంటాయి. అలాంటి తీవ్రమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అల్టిమా ప్రొటెక్ ఇప్ప డు లామినేషన్ గార్డ్ సాంకేతికతతో, పదేళ్ళ పర్ ఫార్మన్స్ వారంటీతో వచ్చింది. ఇది ఇంటి బయటి భాగాల కు లామినేషన్ ను అందిస్తుంది. ఎక్స్ టీరియర్ పెయింట్స్ కు దీన్నొక అత్యున్నత ప్రమాణంగా చేసింది. ఈ ఆశయాన్ని దృష్టిలో ఉంచుకొని, నూతన టీవీసీ లామినేషన్ ప్రొటెక్షన్ లో అల్టిమా ప్రొటెక్ ఏ విధంగా అత్యుత్తమమైనదో తెలియజేస్తుంది. ఒగ్లివీ ఇండియా రూపొందించిన భావనకు ప్రఖ్యాత డైరెక్టర్ వాసన్ బాలా దర్శకత్వం వహించారు.
కొత్తగా పెయింట్ వేసిన రెండు పక్కపక్క ఇళ్లను చూపించడంతో ఈ ఫిల్మ్ ప్రారంభమవుతుంది. అలెగ్జాం డర్ ఇందులో సంప్రదాయక దుస్తుల్లో సంగీతసాధనలో కనిపిస్తారు. పొరుగునే ఉన్న మరో ఇంట్లో మరో అలెగ్జాండర్ (స్మార్ట్ దుస్తుల్లో తయారైన వ్యక్తి) తన అందమైన ఇంటి గురించి పాడడం ప్రారంభిస్తారు. వారి మధ్య పోటీ నెలకొంటుంది. వారిద్దరూ తమ ఎక్స్ టీరియర్ పెయింట్ గురించి, విపరీత వాతావరణ పరిస్థి తుల్లో అవి ఎలా గొప్ప రక్షణను అందిస్తాయో చెప్పుకుంటూ ఉంటారు. ఇద్దరి మధ్య పోటీ తారస్థాయికి చేరుకుంటుంది. అప్పుడు వారి గురూజీ భగవతి పెరుమాళ్ రంగప్రవేశం చేస్తారు. వారిద్దరూ వాడిండి ఒకే పెయింట్ అని, అది ఏషియన్ పెయింట్స్ అల్టిమా ప్రొటెక్ అని వారిని శాంతింపజేస్తారు. అల్టిమా ప్రొటెక్ వీటుక్కె లామినేషన్ అంటే, అల్టిమా ప్రొటెక్ మీ ఇంటికి లామినేషన్ అందిస్తుంది అనే ప్రకటనతో ఈ ఫిల్మ్ ముగుస్తుంది. ఈ సందర్భంగా ఈ నూతన టీవీ యాడ్ గురించి ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్ ఎండీ, సీఈఓ అమిత్ సింగ్లే మాట్లాడుతూ, ‘‘ఎక్స్ టీరియర్ పెయింటింగ్ విషయానికి వస్తే, అల్టిమా ప్రొటెక్ అనేది విశ్వసనీయతకు, పనితీరుకు ప్రతీకగా నిలిచింది. వినియోగదారులు ఈ ఉత్పాదన వినియోగించినప్పుడు, వారు తమ ఇళ్లకు పెయింట్ మాత్రమే వేసుకున్నట్లు కాదు, వాతావరణ హానికర ప్రభావాల నుంచి రక్షణగా లామి నేషన్ కూడా చేసుకున్నట్లు. గతంలో మా క్యాంపెయిన్ వినియోగదారుల ప్రవర్తనలో మార్పుపై దృష్టి పెట్టిం ది. దాంతో ఇంటి లామినేషన్ పై సందేహాలతో అనేక మంది మా డీలర్ల వద్దకు వచ్చారు. అది మాకు గొప్ప విజయం. దాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేలా సంగీతద్వయం అల్టిమా ప్రొటెక్ ఎంత గొప్ప హోమ్ లామినేషన్ పెయింట్ అని సంభాషించుకోవడంతో మళ్లీ తిరిగి వచ్చాం’’ అని అన్నారు.
ఒగ్లివీ అండ్ మాథర్ ఇండియా చీఫ్ స్ట్రాటజీ ఆఫీస్ ప్రేమ్ నారాయణ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘2019 లో మేం చేసిన క్యాంపెయిన్ ‘లామినేషన్ పెయింట్’ ను ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఎక్స్ టీరియర్ పెయింట్స్ కు ఓ ప్రమాణంగా నిలబెట్టింది. లామినేషన్ పెయింట్ అంటేనే ఏషియన్ పెయింట్స్ అల్టిమా ప్రొటెక్ అనేలా చేయాలన్నది ఈ క్యాంపెయిన్ ద్వారా మా ఉద్దేశం. వాన, దుమ్ము, వేడి నుంచి తమ ఇళ్లకు రక్షణ కల్పించేది ఈ పెయింట్ మాత్రమే అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు దీని రక్షణను విశ్వసిస్తున్నారు’’ అని అన్నారు.