Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కరోనా చికిత్సలో ఉపయోగించే 'యాంటీ బాడీ కాక్టెయిల్ థెరపీ'కి ఆరోగ్య బీమా వర్తిస్తుందని ఇన్సురెన్స్ రెగ్యులేటర్ ఇన్సురెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్డీఐ) బీమా సంస్థలకు స్పష్టం చేసింది. ఈ చికిత్సలో క్లెయిమ్స్‌ను తిరస్కరించరాదని ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటి వరకు బీమా సంస్థలు ఈ క్లెయిమ్‌లను తిరిస్కరిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఐఆర్డీఏ తాజా సర్క్యూలను జారీ చేసింది. నిబంధనల ప్రకారం క్లెయింల పరిష్కారానికిగాను తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఇందులో ఆదేశించింది