Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి చెందిన ఆస్తులను హైదరాబాద్‌కు చెందిన ఏస్ అర్బన్ డెవలపర్స్ లిమిటెడ్ కొనుగోలు చేసింది. ఎపి జెమ్స్ అండ్ జ్యూయలర్స్ సంస్థకి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో రెండెకరాల స్థలంతో పాటు ఐదు అతంస్థుల భవనం ఉంది. 2018 నుంచి ఈ ఆస్తులు ఇడి అటాచ్మెంట్లో ఉన్నాయి. ఈ ఆస్తులను కార్పొరేట్ దివాళా చట్టం కింద ఏస్ స్వాధీనం చేసుకుంది. ఇందుకోసం రూ.107 కోట్లు చెల్లించనుంది. ఎపి జెమ్స్ అండ్ జ్యూయల్లరీ కంపెనీ 2001లో హైదరాబాద్‌లో ఏర్పాటు అయ్యింది. ఆ తర్వాత దీన్ని చోక్సి కొనుగోలు చేశారు.
ప్రస్తుతం పరిస్థితుల్లో కార్పోరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ (సిఐఆర్పి) కింద నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఏస్ డెవలపర్స్‌కు అప్పగించడానికి ఆమోదం తెలిపింది.