Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : అపార్ట్‌మెంట్ల కొనుగోలుకు బదులుగా నివాస స్థలాల కొనుగోళ్లలోనే అధిక రాబడులు నమోదవుతున్నాయని హౌసింగ్ డాట్ కామ్ తాజా అధ్యయనం వెల్లడించింది. 2015 తర్వాత దేశ వ్యాప్తంగా ఎనిమిది నగరాలలో నివాస ఇళ్ల ధరల్లో సగటున 7 శాతం పెరుగుదల నమోదు కాగా.. అపార్ట్‌మెంట్ల ధరలు 2 శాతం మాత్రమే పెరిగాయని ఈ రిపోర్ట్ పేర్కొంది. ''ఢిల్లీ, ఎన్‌సిఆర్, ముంబయి, పూణె, హైదరాబాద్, చెన్నరు, కోల్‌కతా, అహ్మాదాబాద్‌లో సాధారణంగా ప్లాట్స్ కొనుగోలు కన్నా అపార్ట్‌మెంట్లను కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత చూపుతున్నారన్నారు. ఈ నగరాల్లో భూముల ధరలు 13 శాతం నుంచి 21 శాతం పెరుగుతన్నాయి. అదే సమయంలో అపార్ట్‌మెంట్ ధరల్లో 2 నుంచి 6 శాతం మాత్రమే పెరుగుదల ఉంది. పెట్టుబడులపై అత్యధిక రాబడులను వ్యక్తిగత నివాస ప్లాట్లు సష్టిస్తున్నాయి.'' అని హౌసింగ్ డాట్ కామ్ సిఇఒ ధవ్ అగర్వాల అన్నారు.