Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని ఎల్ఐసి విలువను రూ.15 లక్షల కోట్లు (203 బిలియన్ డాలర్లు) పైగా నిర్ణయించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. త్వరలోనే ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ) ఫైలింగ్‌కు వెళ్లనున్న నేపథ్యంలో ఎల్ఐసి విలువను గణించినట్లు సమాచారం. ఫిబ్రవరి తొలి వారంలో దీనికి సంబంధించిన ఐపిఒ ప్రతిపాదిత పత్రాన్ని సెబీకి సమర్పించే అవకాశాలున్నాయి. దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ కంపెనీలైన రిలయన్స్ ఇండిస్టీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మార్కెట్ విలువ వరుసగా రూ.17 లక్షలు, రూ.14.3 లక్షలుగా ఉంది. ఎల్ఐసి విలువ గణింపు అంశంపై ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు స్పందించడానికి నిరాకరించాయి. వచ్చే మార్చి కల్లా ఎల్ఐసిలోని 5 నుంచి 10 శాతం వాటాలను మార్కెట్ శక్తులకు విక్రయించాలని మోడీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో కనీసం రూ.75వేల కోట్లు తన ఖజానాలో నింపుకోవాలని.. ఆ మొత్తం విలువ చేసే షేర్లను ప్రయివేటు, విదేశీ శక్తులకు అప్పగించాలని నిర్దేశించుకుంది.