Authorization
Mon Jan 19, 2015 06:51 pm
• డిసెంబర్ 2021లో రూ. 695 కోట్ల రుణాలను జారీ చేసిన ఫిన్‌టెక్
• డిసెంబర్‌లో పైసాబజార్ ద్వారా 668 పట్టణాలలో రుణాలను యాక్సెస్ చేసిన కస్టమర్లు
• దేశ వ్యాప్తంగా 1200+ పట్టణాలలో కస్టమర్ల రుణ అవసరాలను చేరుకున్న పైసాబజార్
గుర్‌గావ్: పైసాబజార్.కామ్, వినియోగదారు రుణాల కోసం ఇండియాలో అతి పెద్ద డిజిటల్ మార్కెట్‌ప్లేస్, వార్షిక రుణ మంజూరు రేటు 1.1 బిలియన్ యూఎస్ డాలర్ల (క్రెడిట్ కార్డుల జారీ మినహాయించి) కు చేరుకుందని ప్రకటించింది. డిసెంబర్ 2021లో, ఈ ఫిన్‌టెక్ రూ. 695 కోట్ల రుణాలను మంజూరు చేసింది, ఇందులో వ్యక్తిగత రుణాలు మరియు వ్యాపార రుణాల వంటి అన్-సెక్యూర్డ్ రుణాలు, అలాగే హోమ్ లోన్స్, లోన్ ఎగైనెస్ట్ ప్రాపర్టీ వంటి సెక్యూర్డ్ రుణాలు ఉన్నాయి.
మార్చి 2020 నుంచి, లెండింగ్ పరిశ్రమపై మహమ్మారి తీవ్రంగా ప్రభావం చూపగా, మరియు లాక్‌డౌన్, మారటోరియం, ఇంకా ఆర్థిక రంగంలో అంతరాయాల వంటి వాటితో పాటు, రుణ పరిశ్రమలో డిజిటల్ మౌళిక వసతులు లేకపోవడం, అలాగే భౌతిక ప్రక్రియలపై అధికంగా ఆధారపడటం వంటి కారణాలతో కొత్త క్రెడిట్ మంజూరులో క్షీణతకు దారితీసిందని, పైసాబజార్ వెల్లడించింది. అయితే, ఆర్థిక కార్యకలాపాలను క్రమంగా, ఇంకా స్థిరంగా తిరిగి ప్రారంభించడం, పరిశ్రమ డిజిటల్ నేతృత్వంలో రుణ ప్రక్రియల వైపు మళ్లడం, దీనితో పాటు ఏప్రిల్ 2021లో సెకండ్ వేవ్ కారణంగా, అది తక్కువ వ్యవధి అయినా సరే, గత 12-15 నెలల్లో రుణాల మొత్తాలు క్రమంగా పెరిగాయి.
“మహమ్మారి అనేది సవాలు అయినా సరే, రుణ పరిశ్రమలో ఇది ఒక ఇన్‌ఫ్లెక్షన్ పాయింట్ అనే విషయం నిరూపితమైంది, దీని కారణంగా ఇప్పుడు మనకు మరింతగా డిజిటల్ దృష్టి గల ప్రక్రియలు, దృఢమైన అండర్‌రైటింగ్ మోడల్‌లు మరియు స్థిరమైన వ్యవస్థలు ఉన్నాయి. దేశంలో అతి పెద్ద మార్కెట్‌ప్లేస్ ప్లాట్‌ఫాంగా, గత 18 నెలలలో, మన విభిన్న వినియోగదారుల విభాగాలకు ఇబ్బంది లేకుండా సేవలు అందించేందుకు, మేము భాగస్వామ్యాలను మరింత లోతుగా మార్చడంపై, డిజిటల్ మౌళిక వసతులను నిర్మించడంపై తీవ్రంగా దృష్టి సారించాము,” అని పైసాబజార్.కామ్, సీఈఓ, కో-ఫౌండర్ అయిన నవీన్ కుక్రేజా అన్నారు.
650 పట్టణాలకు పైగా వినియోగదారులకు ప్రతి నెలా రుణాల యాక్సెస్ పైసాబజార్ చెబుతున్న ప్రకారం, లాక్‌డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత, ఆర్థిక కార్యక్రమాలు పునఃప్రారంభం అయ్యాయి, దీనితో అధిక భౌగోళిక ప్రాంతాలలోని కస్టమర్ల రుణ అవసరాలకు అనుగుణంగా సేవ చేసేందుకు వీలు కలిగింది. ఇది, ప్రస్తుతం, తమ ప్లాట్‌ఫాంపై 10 లక్షలకు పైగా రుణ ఎంక్వైరీలను పొందుతోంది, ఇప్పటివరకూ 1200 పైగా నగరాలు, పట్టణాలలోని కస్టమర్లకు సేవలు అందించింది. ఒక్క డిసెంబర్ నెలలోనే, పైసాబజార్ ప్లాట్‌ఫాంను 668 పైగా నగరాలు, పట్టణాలలోని కస్టమర్లు యాక్సెస్ చేశారు.
“భౌతిక సంప్రదింపులు కష్టంగా మారిన తరుణంలో, రుణ ప్రక్రియలను మేము పూర్తిగా డిజిటల్ వైపు మార్చగలిగాము, దీని ద్వారా మా ప్లాట్‌ఫాంపై దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా రుణాలను పొందగలిగే సౌలభ్యం కల్పిస్తుంది. మా భాగస్వామ్య బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు మాతో పూర్తిగా డిజిటల్ ప్రయాణాలను నిర్మించడంపై దృష్టి పెట్టడం ఈ ప్రయాణంలో ఒక పెద్ద విజయంగా నిలిచింది, దీని ఫలితంగా త్వరిత నిర్ణయం అలాగే మంజూరులతో పాటు పేపర్ లేకుండా, భౌతికంగా లేకుండా అనే ప్రక్రియల ద్వారా కస్టమర్లకు మెరుగైన సౌలభ్యం ఏర్పడింది,” అని పైసాబజార్.కామ్, సీనియర్ డైరెక్టర్ మరియు హెడ్ ఆఫ్ ప్రొడక్ట్ అండ్ ఎనలిటిక్స్, గౌరవ్ అగర్వాల్ అన్నారు.
పైసాబజార్‌పై అందించిన ఆవిష్కరించిన డిజిటల్ ప్రక్రియలలో, సీ-కేవైసీ ఇంటిగ్రేషన్ ద్వారా డిజిటల్ కేవైసీ, ఆధార్ కేవైసీ ఆధారిత ఆఫ్‌లైన్ ఎక్స్ఎంఎల్, వీడియో కేవైసీ, వీడియో ద్వారా లైవ్‌లీనెస్ తనిఖీలు, డిజిటల్‌గా డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయడం/వ్యాలిడేట్ చేయడం, ఈ-మాండేట్‌లు, ఆప్టికల్ కేరక్టర్ రికగ్నిషన్ (ఓసీఆర్), ఈ-సైన్ వంటివి ఉండగా, రుణ ప్రక్రియలలో అన్ని దశలను డిజిటైజర్ చేయడం జరిగింది.
సగానికి పైగా రుణ మంజూరులు టాప్ 5 మెట్రో నగరాలకు వెలుపలి కస్టమర్లకే డిజిటైజేషన్ పెరగడం, దేశవ్యాప్తంగా రుణాలకు డిమాండ్ పెరగడంతో, పైసాబజర్ ఇప్పుడు అధిక స్థాయిలో రుణాలను టాప్ 5 నగరాలకు, అంటే ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్కతాలకు వెలుపల ఉన్న భౌగోళిక ప్రాంతాలలో అందించగలుగుతోంది. సగటున, నెలలో పైసాబజార్ కస్టమర్లకు జారీ చేసే మొత్తం రుణాలలో 55 శాతం వరకు టాప్ 5 నగరాలకు బయట ఉన్న కస్టమర్లకే అందించబడ్డాయి.
టాప్ 5 మెట్రోలలో, ఢిల్లీ ఎన్‌సీఆర్, బెంగళూరులకు, పైసాబజార్ ద్వారా చేసే నెలవారీ రుణ మంజురులో అధిక వాటా ఉండగా, వీటికి సమీపంలో ముంబై నిలిచింది. అలాగే, యువ వినియోగదారు విభాగాలకు అధిక సంఖ్యలో రుణాల మంజూరు జరుగుతోందని ఈ ప్లాట్‌ఫాం గుర్తించింది. నెలలో పైసాబజార్ ద్వారా జారీ అయ్యే రుణాలలో 50 శాతానకి పైగా, 35 సంవత్సరాల వయసు కంటే తక్కువ ఉన్న వయసు వారికి, అలాగే 26 శాతం మొత్తం 30 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారికే జరుగుతోంది.
“కొవిడ్ ఇప్పటికీ మనతోనే ప్రచ్ఛన్నంగా ఉన్నా సరే, వివిధ విభాగాలు మరియు భౌగోళిక ప్రాంతాలకు క్రెడిట్ సరఫరాలో పెరుగుదల, రుణాలు అందించే పరిశ్రమ ఇప్పుడు మరింత దృఢంగా మరియు పటిష్టంగా ఉందని చెప్పేందుకు నిదర్శనం. పైసాబజార్‌లో, మా వినియోగదారులకు మొత్తం రుణ పర్యావరణ వ్యవస్థకు విలువను జోడించడానికి విశ్లేషణలు, సాంకేతికత, భాగస్వామ్యాలను ఉపయోగించి, మా ప్లాట్‌ఫాంను సందర్శించే వివిధ వినియోగదారుల విభాగాలకు, ఉత్పత్తి మరియు ప్రక్రియ ఆవిష్కరణల ద్వారా మా వ్యాపార ప్రాథమికాలను బలోపేతం చేయడం, క్రెడిట్ యాక్సెస్‌ను సులభతరం చేయడంపై మేము దృష్టి నిలిపాము,” అని నవీన్ కుక్రేజా అన్నారు.