Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రతీ సెకన్‌కు ఒక్క ఆర్డర్ సంపాదిస్తున్నామని మాంసహార ఉత్పత్తుల ఇ-కామర్స్ వేదిక ఫ్రెష్ టు హౌమ్ ఓ ప్రకటనలో తెలిపింది. తమ యాప్‌పై ఎక్కువగా చికెన్, మటన్, చేపలు, రొయ్యలు ఆర్డర్ చేస్తున్నారని పేర్కొంది. 2021లో ప్రతీ నెల సగటున 20 లక్షల ఆర్డర్లు నమోదయ్యాయని వెల్లడించింది. గతేడాది కొత్తగా 8 లక్షల మంది వినియోగదారులు జోడించబడ్డారని ఫ్రెష్‌టు హౌమ్ సిఇఒ షాన్ కడవిల్ తెలిపారు. 2021లో కొత్తగా ఎనిమిది ప్రాసెసింగ్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు.