Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: వచ్చే 10-15 ఏళ్లలో గుజరాత్‌లో రూ.5.95 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు రిలయన్స్ ఇండిస్టీస్ ప్రకటించింది. దీనికి సంబంధించి గురువారం ఆ రాష్ట్ర ప్రభుత్వంతో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఒప్పందం కుదర్చుకున్నారు. ఇంధన పునరుత్పాన రంగంలో రూ.5 లక్షల కోట్ల వ్యయం చేయనున్నట్లు రిలయన్స్ తెలిపింది. మరో రూ.60వేల కోట్లు సోలార్ పివి మాడ్యూల్‌లో వెచ్చించనున్నట్లు పేర్కొంది. ఈ ప్రాజెక్టుల ద్వారా 10 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభించనుందని రిల్ తెలిపింది. మరో రూ.25వేల కోట్లను ప్రస్తుత ప్రాజెక్టుల్లో పెట్టనున్నట్లు పేర్కొంది.