Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెచ్‌సీఎల్ వివాదాస్పద నిర్ణయం
ముంబయి : ప్రముఖ ఐటి సేవల సంస్థ హెచ్‌సీఎల్ టెక్నా లజీస్ వివాదస్పద నిర్ణయం తీసుకుంది. ఏడాది మధ్యలో కంపెనీని వీడే ఉద్యోగులు బోనస్ కింద పొందిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని కొత్త నిబంధన పెట్టింది. 2021 సెప్టెంబర్ 1 నుంచి 2022 మార్చ్ 31 మధ్య కంపెనీని వీడే ఉద్యోగులు ఎవరైనా సరే వాళ్ల నుంచి ఎంప్లాయి పర్ఫార్మెన్స్ బోనస్ రికవరీ చేస్తామని నవంబర్ 2021న ఉద్యోగులకు ఆ కంపెనీ మెయిల్ పంపింది. ఐటి పరిశ్రమలోనే ఇది తీవ్ర వివాదాస్పదం కావడంతో వెంటనే ఆ విధానాన్ని వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో హెచ్‌సిఎల్ టెక్ 13.6 శాతం పతనంతో రూ.3,442 కోట్ల నికర లాభాలు నమోదు చేసింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.3,969 కోట్ల లాభాలు ప్రకటించింది.