Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబై: మగపిల్లలకు వాళ్ల పుట్టిన రోజు నాడు రోబో బొమ్మలు లేదా కన్ స్ట్రక్షన్ సెట్స్ లాంటివి బహుమతిగా ఇస్తే, ఆడపిల్లలకు మాత్రం వారి పుట్టిన రోజున కిచెన్ సెట్స్ ను ఎందుకు బహుమానంగా ఇస్తారు? మనలో దాగిఉన్న జెండర్ వివక్ష అనేది బాలికలను వెనుకనే ఉంచుతోందా, ఐక్యరాజ్యసమితి నివేదికల ప్రకారం, భారతదేశంలో స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్) సిబ్బందిలో మహిళలు 14% మాత్రమే ఉన్నారు. అగ్రగామి చర్మసంరక్షణ బ్రాండ్ అయిన ఓలే, సైన్స్ బ్రాండ్ గా ఉంటోంది. ఆరోగ్యదాయకంగా కనిపించేలా, అందమైన చర్మంతో ఉండేలా సైన్స్ అండగా సంచలనాత్మక పదార్థాలు, ఫార్ములేషన్స్ తో ఉత్పాదనలను అందిస్తోంది. అంతేగాకుండా ఓలే మహిళల బ్రాండ్ గా కూడా ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఓలే 220 మంది శాస్త్రవేత్తలను కలిగి ఉండగా, అందులో 50% మహిళలే ఉన్నారు. స్టెమ్ కెరీర్స్ లో మరింతగా మహిళలు ప్రపంచానికి అవసరమని ఓలే విశ్వసి స్తోంది. భారతదేశంలో ఉన్న స్టెమ్ జెండర్ అంతరం సమీకరణాన్ని మార్చాల్సిన అవసరం ఉందని కూడా నమ్ము తోంది. సాంస్కృతికపరమైన అడ్డంకులు, జెండర్ పోషించే పాత్రపై అపోహలు లాంటివాటితో మహిళలు తరచుగా సంరక్షకు లుగా, గృహిణులుగానే మిగిలిపోతున్నారు. టీచింగ్, నర్సింగ్, కళలు, ఇంటిని చక్కదిద్దుకోవడం లాంటి వాటికే పరిమితమైపోతున్నారు. లింగ వివక్ష, అపోహలు లాంటివి మహిళలను వెనుకవరుసలోనే ఉండేలా చేస్తున్నాయి. దేశం లో స్టెమ్ ఉద్యోగాల సంఖ్య పెరుగుతోంది. భవిష్యత్ ఉద్యోగాల్లో సరైన విధంగా పాల్గొనేందుకు వీలుగా స్టెమ్ కోర్సు లను, కెరీర్స్ ను ఎంచుకునే విధంగా భారతీయ బాలికలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఓలే విశ్వసిస్తోంది.
స్టెమ్ ది గ్యాప్ వంటి అర్థవంతమైన కార్యక్రమాలను ప్రారంభించడం ద్వారా స్టెమ్ లో ఉన్న జెండర్ అంతరానికి ముగింపు పలికేందుకు ఓలే కట్టుబడి ఉంది. మనలో అనాలోచితంగానే ఉంటున్న ధోరణి స్టెమ్ అనేది బాలికలకు కాదు అనే విషయాన్ని ఎలా బయటకు తెస్తుందన్నఅంశాన్ని బలంగా కనిపించేలా ఫిల్మ్ ను ఈ బ్రాండ్ తీసుకువచ్చింది. స్టెమ్ ది గ్యాప్ కోసం మనమంతా కలసికట్టుగా పని చేసేందుకు పిలుపునిచ్చింది.
అంతేగాకుండా, బాలికల స్టెమ్ చదువుల కోసం అండగా నిలిచేందుకు ఈ బ్రాండ్ పలు చర్యలు తీసుకుంటోంది. భారతదేశ స్కూట్ ఎడ్ టెక్ అగ్రగామి సంస్థ లీడ్ తో కలసి బాలికల కోసం స్టెమ్ స్కాలర్ షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. లీడ్ సంస్థ 3000కు పైగా పాఠశాల్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను 12 లక్షలకు పైగా విద్యార్థులకు అందిస్తోంది. 2021 నుంచి ఓలే దేశంలోని ఆరు రాష్ట్రాల్లో ఈ స్కాలర్ షిప్ కింద బాలికలకు ట్యూషన్ ఫీజు చెల్లిస్తోంది. ట్యాబ్ లు, డేటా ప్యాక్ లు అందిస్తోంది.
ఈ సందర్భంగా స్టెమ్ ది గ్యాప్ ఓలె కార్యక్రమం గురించి ప్రొక్టర్ అండ్ గాంబుల్ (పి అండ్ జి) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (స్కిన్, పర్సనల్ కేర్ – ఏషియా పసిఫిక్, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా) ప్రియాలి కామత్ మాట్లాడుతూ, ‘‘ఓలే అనేది సైన్స్ లో ప్రగాఢ మూలాలు ఉన్న సంస్థ. మా శాస్త్రవేత్తల్లో 50 శాతం మంది మహిళలే. అద్భుతమైన శాస్త్రవేత్తలు కాగలిగిన శక్తిసామర్థ్యాలు మహిళల్లో ఉన్న సంగతి మాకు తెలుసు. రోజురోజుకు మరెన్నో ఉద్యోగాలు స్టెమ్ ఆధారితం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్ ఉద్యోగాల కోసం బాలికల ను సన్నద్ధం చేయడం మనందరి బాధ్యత అని మేం విశ్వసిస్తున్నాం. అందుకే స్టెమ్ లో జెండర్ అంతరం భర్తీ చేసేందుకు సాయం చేసేందుకు మేం కట్టుబడి ఉన్నాం. మదిని సృజించే, ఆలోచనలు రేకెత్తించే ఫిల్మ్ ను రూపొందించడం మాకెంతో ఆనందం కలిగిస్తోంది. మన సమాజంలో రోజువారీ జీవితంలో లింగ వివక్ష ఎలా కొనసాగుతుందో చాటిచెప్పే ఉదంతాలతో ఈ ఫిల్మ్ రూపుదిద్దుకుంది. లీడ్ తో కలసి మా స్కాలర్ షిప్ కార్యక్రమం ఇప్పటికే నిజమైన, అర్థవంతమైన మార్పును తీసుకువచ్చింది. భారతదేశంలోని బాలికలకు సానుకూల భవిష్యత్ అందించడంలో భాగం కావడం మాకెంతో ఆనందదాయకం’’ అని అన్నారు.
లీడ్ సహ వ్యవస్థాపకులు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుమీత్ మెహతా ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘ఓ లే స్కాలర్ షిప్స్ ఎంతో అర్థవంతమైనవి. బాలికలు తమకు ఇష్టమైన వాటిని చదివేందుకు వారిని సిద్ధం చేస్తాయి. పాఠశాలలను మరీ ముఖ్యంగా చిన్న పట్టణాల్లో ఉన్న వాటిని పరివర్తింపజేయడం ద్వారా ప్రతి చి న్నారికి కూడా చక్కటి విద్య అందించాలన్నది మా ఆశయం. ఓలేతో మా భాగస్వామ్యం విద్యార్థులకు మ రింతగా తోడ్పడేందుకు, ఎవరు ఎక్కడ చదువుకుంటున్నారన్న దానితో సంబంధం లేకుండా చదువు ను మరింత ప్రజాస్వామీకరించేందుకు తోడ్పడుతుంది. బాలికలకు తొలినాటి ఏళ్లు పునాదిలా ఉంటాయి. సానుకూల మార్పు తీసుకు వచ్చేందుకు, స్టెమ్ లో లింగ వివక్షను దూరం చేసేందుకు ఈ సదాశయంలో భాగస్వామ్యం మాకెంతో ఆనందదాయకం’’ అని అన్నారు.