Authorization
Mon Jan 19, 2015 06:51 pm
· జనవరి 16-20 వరకు అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో ప్రత్యేక ఆఫర్లు
· 18 నెలల నో కాస్ట్ ఇఎంఐతో అదనపు క్యాష్ బ్యాక్ మరియు రూ.2000 వరకు రాయితీలు
· ‘నో క్వశ్చన్స్ ఆస్క్డ్’ రిటర్న్
హైదరాబాద్: భారతదేశపు అత్యంత విశ్వసనీయమైన వినియోగదారుల ఎలక్ర్టానిక్స్ బ్రాండ్ శామ్సంగ్ తన రెండు ఫ్రీస్టాండింగ్ డిష్ వాషర్ మోడళ్లను తన ఇ-కామర్స్ వేదిక అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో జనవరి 16-20 అవధిలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ డిష్ వాషర్లు ఇంటెన్సివ్‌వాష్ ప్రోగ్రామ్‌తో తయారుగా ఉంటూ, వాటిని ప్రత్యేకంగా గ్రీజు, మిగిలి పోయిన వంట నూనె, కడాయి కాలిన గుర్తులు మాత్రమే కాకుండా వంట పాత్రలను శుభ్రం చేసేలా ప్రత్యేకంగా తయారు చేశారు. స్టెయిన్ లెస్ స్టీల్ సిల్వర్ మరియు తెలుపు వర్ణాల్లో ప్రత్యక ధరల్లో వరుసగా రూ.38,990 మరియు రూ.35,990ల్లో లభిస్తుంది.
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో (https://www.amazon.in/dp/B099FHFSSL) వినియోగదారులు డిష్ వాషర్లను రూ.1,999కు 18 నెలల అవధికి జీరో ఖర్చు ఇఎంఐలో కొనుగోలు చేసుకోవచ్చు. రూ.2,000 వరకు క్యాష్‌బ్యాక్‌లను మరియు రాయితీ అందుకునేందుకు అర్హత పొందుతారు. ఈ ఆఫర్ అవధిలో చేసే కొనుగోలు ‘నో క్వశ్చన్స్ ఆస్క్డ్’ రిటర్న్ అర్హతను కూడా కలిగి ఉంటాయి. కొత్త శామ్సంగ్ డిష్వాషర్ శ్రేణి ఇంట్లో పనులు చేసుకుంటూనే వర్క్ ఫ్రం హోమ్ బాధ్యతలను నిర్వహిస్తున్న లక్షలాది మంది బాధ్యతలను పరిష్కరించడమే కాకుండా హైజిన్ వాష్ ఫీచర్‌తో వినియోగదారులకు పరిశుభ్రమైన అవసరాలను పరిష్కరించడంతో, మిగిలిన ఆహారంతో వృద్ధి చెందే బ్యాక్టీరియాను 99.99 శాతం మేర (ఇంటర్ టెక్ ధృవీకరణ) నివారిస్తుంది. ఈ మోడళ్లు స్టెయిన్లెస్ స్టీల్ టబ్ తో అందుబాటులోకి వస్తుండగా, దాన్ని తక్కువ శబ్దంతో శుభ్రపరుస్తూ, అలాగే స్టెరిలైజింగ్ రిన్స్లకు ఉన్నత ఉష్ణతను నిర్వహించేలా డిజైన్ చేశారు.
శామ్సంగ్ డిష్వాషర్లు భారతదేశంలోని వంట పాత్రలైన కుక్కర్, కడాయిలను పరిణామకారిగా శుభ్రపరిచే, 13 ప్లేస్ సెట్టింగ్స్‌తో అందుబాటులోకి వస్తుండగా, అది ఒక వాష్ సైకిల్లో వివిధ పరిమాణాల పాత్రలను శుభ్రం చేస్తుంది. హైట్ అడ్జెస్ట్ మెంట్ ఎంపిక భారతదేశంలోని వంట గదుల్లో సామాన్యమైన పెద్ద పాత్రలు, బాండ్లీలకు అవకాశం కల్పిస్తుంది.
‘‘వినియోగదారులు తమ జీవనశైలుల్ని అప్‌గ్రేడ్ చేసుకునేందుకు, తమ ఇళ్లను పూర్తిగా మార్చుకునేందుకు వేచి చూస్తున్నారు. ఇందులో వంట గది కూడా ఉండగా, అది అన్ని భారతీయుల ఇళ్లలో కేంద్ర బిందువుగా ఉంది. శామ్సంగ్ డిష్వాషర్లు ఇంటెన్సివ్వాష్తో సిద్ధంగా ఉంటాయి. భారతీయ వంటగదులకు ప్రత్యేకంగా డిజైన్ చేయగా, అత్యుత్తమ అనుకూలత మరియు పరిశుభ్రతను అందిస్తాయి. ఈ కొత్త శ్రేణి అమెజాన్‌లో అందుబాటులో ఉండగా, ఇవి వినియోగదారులకు వారి జీవనశైలులను అప్ గ్రేడ్ చేసుకునేందుకు, ఉన్నత స్థాయి అనుకూలతను అందించేందుకు అందులోనూ పలువురు ఇళ్ల నుంచే తమ పనులు చేసుకుంటున్న సందర్భంలో మద్దతు ఇస్తుంది’’ అని శామ్సంగ్ ఇండియా ఆన్ లైన్ బిజినెస్, కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ సీనియరు డైరెక్టర్ సందీప్ సింగ్ అరోరా తెలిపారు.
ప్రముఖ ప్రత్యేకతలు:
13 ప్లేస్ సెట్టింగ్స్
శామ్సంగ్ డిష్వాషర్లు 13 ప్లేస్ సెట్టింగ్స్‌తో అందుబాటులోకి రాగా, ఆరుగురు సభ్యులు ఉన్న కుటుంబానికి సరైనది. ఒక వాష్ సైకిల్ లో వివిధ పరిమాణాల పాత్రలను శుభ్రం చేస్తుంది.
ఇంటెన్సివ్‌వాష్
ఇంటెన్సివ్‌వాష్ కార్యక్రమం అత్యంత ఎక్కువగా జిడ్డు అంటుకుని ఉన్న పాత్రలు, బాటిళ్లు, కడాయిలు, కుక్కర్లను వాస్తవంగా చక్కగా శుభ్రపరిచేందుకు సహకరిస్తుంది. దీన్ని పాత్రలు, డిష్‌లు, కుక్వేర్ల నుంచి గ్రీజు, మిగిలిన నూనె, కాలిన గుర్తులను తొలగించేలా డిజైన్ చేశారు. హైజిన్ వాష్ అంతిమంగా కడగడాన్ని వృద్ధి చేస్తుంది. నీటి ఉష్ణోగ్రతను 70 డిగ్రీ సెంటీగ్రేడ్‌కు పెంచి, లోతైన స్వచ్ఛతను అందిస్తుంది. ఇంటెన్సివ్‌వాష్ ప్రోగ్రామ్ ఉపయోగించినప్పుడు 99.99% బ్యాక్టీరియాను నివారిస్తుండడంతో పాత్రలు, కట్లరీ, బాండ్లీలను వినియోగించుకునేందుకు సురక్షితంగా ఉంటాయి.
స్టెయిన్లెస్ టబ్
మీ డిష్‌వాషర్‌ను కొత్తదానిలా కనిపించేలా చేయండి. స్టెయిన్లెస్ స్టీల్ టబ్ ఎక్కువ మన్నిక, నిశ్చబ్దం అలాగే సంప్రదాయకంగా కడిగే దానికన్నా స్వచ్ఛంగా ఉంచుతుంది. ఇది తక్కువ శబ్దం చేస్తుంది. పాత్రలు కడిగే సమయంలో ఎక్కువ ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది. కాలం గడిచిన కొద్దీ రంగు కోల్పోకుండా, దుర్వాసన రాకుండా అడ్డుకుంటుంది.
హైట్ అడ్జెస్ట్ మెంట్
హైట్ అడ్జెస్ట్ మెంట్ ఎంపిక పెద్ద పరిమాణంలో ఉండే పాత్రలను డిష్వాషర్లో ఉంచేందుకు అవకాశాన్ని కల్పిస్తుంది. దీనితో అప్పర్ ర్యాక్ నుంచి పైకి అలాగే కిందకు అమర్చవచ్చు. దీనితో పెద్ద పరిమాణంలో ఉండే కడాయి లేదా బాండ్లీలను, వాషర్ లోని గోడలకు తగలకుండా, లేదా అప్పర్ ర్యాక్కు తగల్చకుండానే లోపల ఉంచవచ్చు.
స్మార్ట్ లీకేజ్ సెన్సర్
స్మార్ట్ లీకేజ్ సెన్సర్ నీరు కొద్దిగా కూడా లీక్ కాకుండా రక్షిస్తుంది. ఇది తక్షణమే నీటి సైకిల్‌ను నిలిపి వేస్తుంది, నీటిని ఆరబెడుతుంది. ఏదైనా లీకేజ్ కనిపిస్తే ఎర్రర్ సందేశాన్ని చూపిస్తుంది.
వైడ్ ఎల్ఇడి డిస్ప్లే
పాత్రలను కడిగేందుకు పెద్దది అలాగే విస్తారమైన ఎల్ఇడి డిస్ప్లేతో సరళమైన మరియు ఎక్కువ ఇంటూటివ్ విధానాన్ని ఆస్వాదించేందుకు, తేలికగా చదివేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది. మీరు తక్షణమే స్టేటస్, సెట్టింగ్స్, మిగిలిన సమయం సైకిల్ ప్రోగ్రెస్ తదితరాలను దూరం నుంచే పరీక్షించుకోవచ్చు. దీనితో మీరు శుభ్రపరిచే పనితీరును గమనించవచ్చు. నియంత్రించవచ్చు.
ఫింగర్‌ప్రింట్ రెసిస్టెంట్ ఫినిష్
ఫింగర్‌ప్రింట్ రెసిస్టెంట్ ఫినిష్ చెడ్డగా కనిపించే వేలిముద్రలు మరియు ఇతర గుర్తులు, జిడ్డు ఉపరితలాలపై లేకుండా నిరోధిస్తుంది. ఒక వేళ ఏదైనా కనిపించినట్లయితే వాటిని సులభంగా తుడిచివేయవచ్చు. కనుక, మీ ఇల్లు దోషరహితంగా అందంగా కనిపిస్తుంది.