Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ శాంసంగ్, నేడు గెలాక్సీ ట్యాబ్ ఏ8ను పూర్తి సరికొత్త డిజైన్, ఆకర్షణీయమైన భారీ స్ర్కీన్, అతిపెద్ద బ్యాటరీ మరియు అత్యుత్తమ ఆడియో అనుభవాలతో అందిస్తుంది. అభ్యాసం, వినోదం, అనుసంధానత మరియు మరెన్నో అంశాల కోసం అత్యంత శక్తివంతమైన ట్యాబ్ ఏ సిరీస్ ఉపకరణం గెలాక్సీ ట్యాబ్ ఏ8.
‘‘శాంసంగ్ వద్ద మేము అవిశ్రాంతంగా కృషి చేస్తూ అర్ధవంతమైన ఆవిష్కరణలు, అత్యుత్తమ ఉపకరణ అనుభవాలను మా వినియోగదారులకు అందిస్తున్నాము. గత కొద్ది సంవత్సరాలలో, అన్ని వినియోగదారుల విభాగాలలోనూ ఖచ్చితంగా కావాల్సిన ఉపకరణంగా ట్యాబ్లెట్స్ నిలుస్తాయి. గెలాక్సీ ట్యాబ్ ఏ8 అత్యంత సమర్థవంతమైన ప్యాకేజీగా నిలుస్తుంది. మా వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని దీనిని తీర్చిదిద్దాము. అతిపెద్ద డిస్‌ప్లే, సుదీర్ఘమైన బ్యాటరీ మరియు డాల్బీ క్వాడ్ స్పీకర్లు దీనిలో ఉన్నాయి. మీ పనులు సంపూర్ణంగా అయ్యేందుకు ఇది అత్యంత ఖచ్చితమైన ఉపకరణంగా నిలుస్తుంది’’అని సందీప్ పొశ్వాల్, జనరల్ మేనేజర్, న్యూ కంప్యూటింగ్ బిజినెస్,శాంసంగ్ ఇండియా అన్నారు.
అవాంతరాలు లేని వినోదం కోసం అతి పెద్ద స్ర్కీన్
గెలాక్సీ ట్యాబ్ ఏ8లో సన్నటి బీజెల్‌తో విస్తరించిన 10.5 అంగుళాల స్ర్కీన్ ఉంది. ఇది 16ః10 కామన్ యాస్పెక్ట్ రేషియోతో వస్తుంది. ఈ ఫలితంగానే ఇది 80% స్ర్కీన్ టు బాడీ రేషియోను ప్రదర్శిస్తుంది. ఇది మరింతగా లీనమయ్యే వీక్షణ అనుభవాలను గత ట్యాబ్లెట్ మోడల్స్‌తో పోలిస్తే అందిస్తుంది. ఈ డిస్‌ప్లే వైవిధ్యమైన, శక్తివంతమైన వీక్షణ అనుభవాలకు భరోసా అందించడంతో పాటుగా డాల్బీ అట్మాస్‌తో కూడిన నాలుగు స్పీకర్లు మహోన్నతమైన శబ్ద అనుభవాలను సాటిలేని వివరాలు, లోతు మరియు వాస్తవికతతో అందిస్తాయి. వినియోగదారులు మహోన్నతమైన స్టీరియో సౌండ్‌ను క్వాడ్ స్పీకర్లతో అందించడంతో పాటుగా లీనమయ్యే సినిమాటిక్ అనుభవాలను సైతం అందిస్తారు.
శక్తివంతమైన టాబ్లెట్
శక్తివంతమైన ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో కూడిన గెలాక్సీ ట్యాబ్8ను వేగవంతమైన, మృదువైన అనుభవాలను ఎలాంటి ఆలస్యం లేకుండా అందించే రీతిలో రూపొందించారు. గెలాక్సీ ట్యాబ్ ఏ8, మెరుగైన పనితీరు, మృదువైన మల్టీ టాస్కింగ్, సౌకర్యవంతమైన యాప్ నేవిగేషన్ మరియు అవాంతరాలు లేని గేమింగ్‌ను అందిస్తుంది. శక్తివంతమైన 7040 ఎంఏహెచ్ బ్యాటరీ మరియు 15వాట్ల వరకూ వేగవంతమైన చార్జింగ్‌తో కూడిన గెలాక్సీ ట్యాబ్ ఏ8, వినియోగదారులు గంటల తరబడి బ్యాటరీ అవుతుందనే బాధలేకుండా స్ట్రీమింగ్ చేసేందుకు తోడ్పడుతుంది.
సమృద్ధి, ప్రాప్యత, చిన్నారులకు సురక్షితం
గెలాక్సీ ట్యాబ్ ఏ8 లు 8 మెగా పిక్సెల్ వెనుక కెమెరా, 5 మెగా పిక్సెల్ ముందు కెమెరా మరియు పూర్తి సరికొత్త స్ర్కీన్ రికార్డర్ ఫీచర్‌తో వస్తుంది. ఈ స్ర్కీన్ రికార్డర్ ఫీచర్, స్పష్టమైన, సవివరమైన వీడియోలను రికార్డ్ చేస్తుంది. దీనిలో ట్యుటోరియల్స్ లేదా లెక్చర్లు లేదా ఆఖరకు మీరు మీ గొంతుతో ఏదైనా వివరణ ఇస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు రికార్డింగ్ చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. గెలాక్సీ ట్యాబ్ ఏ8 విస్తృతశ్రేణి అనుసంధానిత విద్యా సమాచారం అందిస్తుంది మరియు సౌకర్యవంతమై పేరెంటల్ కంట్రోల్స్ ఉండటం వల్ల తమ పిల్లలకు సురక్షితమైన మరియు అనుసంధానితఅభ్యాస వాతావరణాన్ని ఇంటి వద్ద మరియు ప్రయాణ సమయంలో అందిస్తున్నామనే భరోసా కల్పిస్తుంది. గెలాక్సీ ట్యాబ్ ఏ8 లో శాంసంగ్ యొక్క సిగ్నేచర్ డిఫెన్స్ గ్రేడ్ సెక్యూరిటీ ప్లాట్‌ఫామ్ నాక్స్ ఉంది. ఇది మీ డాటా మరియు లావాదేవీలను సురక్షితంగా ఉంచుతుంది. గెలాక్సీ ట్యాబ్ ఏ8 లోని ఫేస్ రికగ్నైజేషన్ ఫీచర్ మీ డాటా మరియు లావాదేవీలను సురక్షితంగా నిలుపుతుంది. గెలాక్సీ ట్యాబ్ ఏ8 ఫీచర్ ట్యాబ్ యజమానులు మాత్రమే ట్యాబ్ తెరువగలరనే భరోసా అందించడంతో పాటుగా తమ ఉపకరణాన్ని అతి సులభంగా పొందే అవకాశం కూడా అందిస్తుంది.
ఎన్నో మార్గాలలో
వినోదాత్మక మరియు ఉత్పాదక అనుభవాలను గెలాక్సీ ట్యాబ్ ఏ8 అందిస్తుంది. ఇది ప్రతి రోజూ జీవితాన్ని సులభంగా మరియు అత్యుత్తమంగా అర్ధవంతమైన మార్గాలలో చేస్తుంది. సరళమైన, శక్తివంతమైన మల్టీటాస్కింగ్ కోసం వినియోగదారులు తమ స్ర్కీన్‌ను విడగొట్టడంతో పాటుగా రెండు యాప్‌లను పక్క పక్కనే ఉపయోగించవచ్చు మరియు దీనికి పాపప్ విండో సైతం మల్టీ యాక్టివ్ విండోతో జోడించవచ్చు. దీనిలో డ్రాగ్ అండ్ స్ల్పిట్ ఫీచర్ ఉంది. ఇది స్వయం చాలకంగా మరింత శక్తివంతమైన వెబ్‌పేజ్ బ్రౌజింగ్ కోసం రెండవ బ్రౌజర్‌ను తెరుస్తుంది.
మెమరీ వేరియంట్స్, ధర, లభ్యత
ఈ జనవరి 17 ప్రారంభించి గెలాక్సీ ట్యాబ్ ఏ8 మూడు ఆహ్లాదకరమైన రంగులు – గ్రే,సిల్వర్, పింక్ గోల్డ్‌లో లభ్యమవుతుంది. గెలాక్సీ ట్యాబ్ ఏ8 వై–ఫై వేరియంట్ 3జీబీ+32జీబీ ధర 17,999 రూపాయలు కాగా 4జీబీ +64జీబీ ధర 19,999 రూపాయలు. ఎల్‌టీఈ వేరియంట్ గెలాక్సీ ట్యాబ్ ఏ8 ధరలు 3జీబీ+32జీబీ వేరియంట్‌కు 21,999 రూపాయలు కాగా, 4జీబీ +64జీబీ వేరియంట్‌కు 23,999 రూపాయలు.
పరిచయ ఆఫర్లు
వినియోగదారులు ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డులను వినియోగించడం ద్వారా 2000 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను పొందడంతో పాటుగా 4499 రూపాయల బుక్ కవర్‌ను కేవలం 999 రూపాయలకే పొందవచ్చు.