Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Sony India ఈరోజు కొత్త WF-1000XM4 ప్రకటించింది – ఇది ఎంతగానో ప్రశంసలందుకున్న 1000X సీరీస్‍లో ట్రూలీ వైర్‍లెస్ క్యాటగరీకు లేటెస్ట్ ఎడిషన్. WF-1000XM4ఇయర్‍బడ్స్ ఇండస్ట్రీ-లీడింగ్ నాయిస్ క్యాన్సిలింగ్[i] మరియు ఆడియో క్వాలిటీని తదుపరి స్థాయికి తీసుకువెళ్తుంది. ప్రతి చెవికి సరిపోయేలా తయారు చేయబడి, అవి ప్రతి పరిస్థితికి అడ్జస్ట్ అయ్యే ఒక పర్సనలైజ్డ్ అనుభవాన్ని అందిస్తాయి.
1. ఇండస్ట్రీ లీడింగ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇయర్‍బడ్స్, ఇవి తక్కువ నాయిస్‍తో స్పష్టమైన సౌండ్ అందిస్తాయి
ఆ WF-1000XM4 ఇండస్ట్రీ లీడింగ్ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీ కలిగినది. పర్సనల్‍గా, Sonyచే అభివృద్ధి చేయబడి, ఇంటిగ్రేటెడ్ ప్రాసెసర్ V1 Sony యొక్క ప్రశంసలు పొందిన QN1e చిప్ యొక్క నాయిస్ క్యాన్సిలేషన్ పనితీరును మరింత పైకి తీసుకువెళ్తుంది. ఇది అద్భుతమైన నాయిస్ క్యాన్సిలేషన్ కోసం అధిక పనితీరు గల డ్యూయల్ నాయిస్ సెన్సార్ మైక్రోఫోన్లను కూడా కలిగి ఉంటుంది. మాగ్నెట్ వాల్యూమ్‍లో 20% పెరుగుదలతో కొత్తగా డిజైన్ చేయబడిన 6mm డ్రైవర్ యూనిట్ కూడా WF-1000XM4 యొక్క నాయిస్ క్యాన్సిలింగ్ సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది. మాగ్నెట్ వాల్యూమ్‍లో పెరుగుదల మరియు అధిక కంప్లయన్స్ డయాఫ్రమ్ తక్కువ ఫ్రీక్వెన్సీలలో మెరుగైన పనితీరును అందిస్తుంది మరియు తక్కువ ఫ్రీక్వెన్సీ రేంజ్‍కి ఒక అధిక-ఖచ్చితమైన క్యాన్సిలేషన్ సిగ్నల్‍ను రూపొందించడం ద్వారా నాయిస్ క్యాన్సిలింగ్‍ను మెరుగుపరుస్తుంది. ఇది కొత్తగా డెవలప్ చేయబడిన నాయిస్ ఐసోలేషన్ ఇయర్‍బడ్ టిప్స్ తో వస్తుంది, ఇది మెరుగైన ఫిట్ అందిస్తుంది.
2. కొత్త ఇంటిగ్రేటెడ్ ప్రాసెసర్ V1తో ఎక్సెప్షనల్ సౌండ్ క్వాలిటీ
WF-1000XM4 అసాధారణమైన క్వాలిటీలో ఆడియో కంటెంట్‍ను అందించడానికి హై-రిజొల్యూషన్ ఆడియో వైర్‍లెస్‍ను సపోర్ట్ చేస్తుంది. ఇంటిగ్రేటెడ్ ప్రాసెసర్ V1 సౌండ్ క్వాలిటీని పెంచి వక్రీకరణను తగ్గిస్తుంది, LDAC codec ప్రాసెసింగ్ మరియు DSEE Extreme™ని ప్రారంభిస్తుంది. Edge-AI, DSEE Extreme™[ii] ను (డిజిటల్ సౌండ్ ఎన్హాన్స్మెంట్ ఇంజిన్)ను ఉపయోగించి రియల్ టైమ్‍లో కంప్రెస్డ్ డిజిటల్ మ్యూజిక్ ఫైల్స్ స్థాయి పెంచుతుంది. ఇన్స్ట్రుమెంటేషన్, మ్యూజికల్ శైలులు మరియు వోకల్స్ లేదా ఇంటర్‍లూడ్స్ వంటి ప్రతి పాటలోని వ్యక్తిగత అంశాలను డైనమిక్‍గా గుర్తించడం ద్వారా, ఇది మరింత సంపన్నమైన, మరింత సంపూర్ణమైన శ్రవణ అనుభవం కోసం కంప్రెషన్‍లో నష్టపోయిన హై-రేంజ్ సౌండ్‍ను పునరుద్ధరిస్తుంది.
3. ఖచ్చితమైన వాయిస్ పికప్ టెక్నాలజీతో క్రిస్టల్-క్లియర్ కాల్ క్వాలిటీని ఆనందించండి
WF-1000XM4 సౌకర్యవంతమైన హ్యాండ్స్-ఫ్రీ కాలింగ్ అనుభవాన్ని అందించడానికి ఒక ఖచ్చితమైన వాయిస్ పికప్ టెక్నాలజీతో వస్తుంది. మైక్రోఫోన్లు మరియు ఒక బోన్-కండక్షన్ సెన్సార్‍తో ఖచ్చితమైన వాయిస్ పికప్ టెక్నాలజీని కలుపుతూ, WF-1000XM4 హ్యాండ్స్-ఫ్రీ కాల్స్ కోసం మీ వాయిస్‍ని స్పష్టంగా మరియు ఖచ్చితంగా పిక్ అప్ చేస్తుంది. అదనంగా, కొత్త బోన్-కండక్షన్ సెన్సార్ వాయిస్ నుండి వైబ్రేషన్లను మాత్రమే తీసుకుంటుంది - ఇది పరిసర సౌండ్ రిజిస్టర్ చేయదు - ఇది కాల్స్ చేస్తున్నప్పుడు మరింత స్పష్టమైన ప్రసంగాన్ని అనుమతిస్తుంది.