Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: విద్యార్థులకు నాణ్యమైన విద్యాను అందించేందుకు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లల జీవితాలపై సానుకూల ప్రభావం కనబరిచేందుకు తనకు గల ఆశయసాధన ప్రయత్నంలో భాగంగా ప్రపంచ అగ్రగామి ఎడ్ టెక్ కంపెనీ అయిన బైజూస్, అక్షయపాత్రతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. బైజూస్ సామాజిక కార్యక్రమం ‘ఎ డ్యుకేషన్ ఫర్ ఆల్’ కింద చేపట్టిన ఈ భాగస్వామ్యం లక్ష్యం, పాఠశాలలు పాక్షికంగా మూతపడినప్పటికీ, వివిధ రాష్ట్రాల్లో మారుమూల ప్రాంతాలతో సహా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన 2 లక్షల మంది పిల్లలకు చదువు కొనసాగించే అవకాశాన్ని కల్పించడం. అక్షయపాత్ర కీలక కార్యక్రమం నేషనల్ ఎండీవర్ ఫర్ స్టూడెంట్ ట్రాన్స్ ఫార్మేషన్ (ఎన్ఇఎస్ టి) ఇన్షియేటివ్ లో భాగమే ఈ డిజిటల్ ఎడ్యుకేషన్. సామూహిక ప్రయత్నాల ద్వారా నాణ్యమైన విద్యను అందించడంలో విద్యావ్యవస్థతో కలసి పని చేయాలని ఇది కోరుకుంటోంది. ఈ సహకారంతో బైజూస్, ఉచిత స్ట్రీమింగ్ లైసెన్సులు, స్మార్ట్ క్లాస్ రూమ్ ల ద్వారా విద్యార్థులకు అధిక నాణ్యమైన, సాంకేతిక చోదిత అభ్యసన కార్యక్రమాలను అందించనుంది.
ఈ కార్యక్రమం గురించి బైజూస్ సహవ్యవస్థాపకులు దివ్య గోకుల్ నాథ్ మాట్లాడుతూ, ‘‘సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన పిల్లల ఉన్నతి కోసం వివిధ పరివర్తనదాయక సామాజిక కార్యక్రమాలను చేపట్టాలని, నాణ్యమైన విద్య, డిజిటల్ యాక్సెస్ పొందడంలో ఉన్న అంతరాలను తొలగించాలనే బలమైన ఆశయం బైజూస్ కు ఉంది. భారతదేశంలో పాఠశాల విద్యార్థులకు భోజన కార్యక్రమాలకు అందించేందుకు నిర్విరామంగా పని చేస్తున్న అక్షయపాత్ర ఫౌండేషన్ తో కలసి పని చేయడం మాకెంతో ఆనందదాయకం. వారితో మా భాగస్వామ్యం చదువు, సంక్షేమం ద్వారా విద్యార్థుల ఉన్నతి పై దీర్ఘకాలిక ప్రభావం కనబరిచే దిశగా గణనీయమైన ముందడుగు అవుతుంది. ప్రస్తుత విద్యావ్యవస్థ పై స్పర్శనీయ ప్రభావాన్ని తీసుకురావడం మా తాత్వికత ప్రధానాంశం. అక్షయపాత్ర ఫౌండేషన్ తో భాగస్వామ్యం మాకెంతో గర్వకారణం. అది మా సామాజిక కార్యక్రమం ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ ను బలోపేతం చేస్తుంది’’ అని అన్నారు.
అంతర్జాతీయ స్థాయి డిజిటల్ ప్లాట్ ఫామ్ మరియు వృత్తినైపుణ్యాలతో అభివృద్ధి చేయబడిన కంటెంట్ కు యాక్సెస్ అందించడంతో ఇంటరాక్టివ్, వినూత్న అభ్యసన అనుభవాన్ని అందించడం ద్వారా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో పిల్లలకు సాధికారికత కల్పించడం ఈ కార్యక్రమం లక్ష్యం. బైజూస్, అక్షయపాత్ర రెండూ ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో కలసి ఆర్థికంగా బలహీనవర్గాలకు చెందిన పిల్లలకు ఇప్పటికే ఉచిత విద్య కార్యక్రమాన్ని ప్రారంభించాయి.
ఈ సందర్భంగా అక్షయపాత్ర ఫౌండేషన్ సీఈఓ శ్రీధర్ వెంకట్ మాట్లాడుతూ, ‘‘ఆకలి కారణంగా ఏ విద్యార్థి కూడా చదువుకు దూరం కాకుండా చూసేందుకు మా నిరంతర ప్రయాణం. సామాజిక, ఆర్థిక నేపథ్యాలతో సంబంధం లేకుండా ప్రతి చిన్నారికి ప్రాథమిక హక్కు అయిన చదువు వారికి అందేందుకు మేం ప్రయత్నిస్తాం. ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన పిల్లలు అందుబాటు లేదా యాక్సెసబిలిటీ సమస్యల కారణంగా చదువుకు దూరం కాకుండా ఉండే పరిస్థితిని కల్పించడంలో డిజిటల్ ఇన్ క్లూజివ్ నెస్ తోడ్పడుతుందని మేం విశ్వసిస్తున్నాం. బైజూస్ తో కలసి పని చేయడం అనేది డిజిటల్ అంతరాన్ని తొలగించేందుకు మేం చేస్తున్న ప్రయత్నం. పిల్లలకు ఉచితంగా నాణ్యమైన, ఆధునిక విద్యను అందించడం ద్వారా డిజిటల్ ఇన్ క్లూజివ్ నెస్ ను పెంచుతున్నాం’’ అని అన్నారు. ‘‘ప్రభుత్వం తన వంతుగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు గణ నీయ ప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మరింత ఊతమిచ్చే దిశలో మా ప్రయత్నాలు ఉండేలా చేస్తుంది ఈ కార్యక్రమం’’ అని అన్నారు.
ఆనందించదగ్గ పాఠశాల వాతావరణం కల్పించడం ద్వారా విద్యార్థి అభ్యసన ఫలితాలకు తోడ్పాటు అందించాలన్నది అక్షయపాత్ర చేపట్టిన నేషనల్ ఎండీవర్ ఫర్ స్టూడెంట్ ట్రాన్స్ ఫార్మేషన్ ఆశయం. దాన్ని సాధించడంలో భాగంగా ఫౌండేషన్, బైజూస్ రూపంలో నేస్తాన్ని పొందింది. తన సామాజిక కార్యక్రమాల ద్వారా డిజిటల్ లెర్నింగ్ ను సాధ్యమైనంత ఎక్కువ మంది విద్యార్థులకు అందించేందుకు అది ప్రయత్నిస్తోంది. రిమోట్ గా నేర్చు కునే అవకాశాన్ని విద్యార్థులకు అందిస్తోంది. 2020లో బైజూస్ ఫ్లాగ్ షిప్ సామాజిక కార్యక్రమం ‘ఎడ్యుకేషన్ ఫర్ ఆల్’ ప్రారంభమైంది. విద్యను ప్రజాస్వామీకరించడం, ప్రతీ విద్యార్థికి కూడా నేర్చుకునే అవకాశాన్ని అందించడం దీని ఆశయం. మారుమూల ప్రాంతాల విద్యార్థులకు, ఆర్థి కంగా బలహీనవర్గాలకు సాంకేతిక చోదిత అభ్యసనం ద్వారా సాధికారికత అందించేందుకు ఈ కార్యక్రమం కట్టుబడి ఉంది. 2025 నాటికి 50 లక్షల మంది ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు సాధికారికత కల్పించే ఆశయంతో, విద్యా వాతా వరణంలో సానుకూల వ్యవస్థాగత మార్పు తీసుకువచ్చేందుకు ఈ కంపెనీ 26 రాష్ట్రాల్లో 100 ఎన్జీవోలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.