Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 6000ఎంఏహెచ్ బ్యాటరీ, 3జీబీ ర్యామ్,
- 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ
- 6.52 హెచ్డీ+ డిస్ప్లే
- ధర 8499 రూపాయలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన ప్రీమియం స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ టెక్నో, మరోమారు మార్కెట్లో సంచలనాలను సృష్టిస్తూ తమ తాజా ఉత్పత్తి ఆఫరింగ్ పాప్ 5 ప్రోను తమ పాప్ సిరీస్ జాబితాలో విడుదల చేసింది. ఈ విభాగంలో అత్యుత్తమ ఫీచర్లు కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.52 హెచ్డీ+ డాట్‌నాచ్ డిస్ప్లే, భారీ 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 మెగాపిక్సెల్ ఏఐ డ్యూయల్ రియర్ కెమెరా ఉన్నాయి. పాప్5 ప్రోలో ఆండ్రాయిడ్ 11 గో ఆధారిత హియోస్ 7.6 శక్తి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 3జీబీ భారీ రామ్ మరియు 32 జీబీ అంతర్గత స్టోరేజీ ఉంది. దీనిని 256 జీబీ వరకూ విస్తరించవచ్చు. అదనంగా, ఈ స్మార్ట్‌ఫోన్‌లో పలు స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు అయినటువంటి ఐపీఎక్స్ 2 స్ల్పాష్ రెసిస్టెంట్, మెరుగైన రీతిలో 14 ప్రాంతీయ భాషల మద్దతు, 120హెర్ట్జ్ శాంప్లింగ్ రేట్ మరియు ఫేస్ అన్‌లాక్ వంటివి ఈ ప్రీమియం డిజైన్‌లో ఆకర్షణీయమైన రంగులలో లభ్యమవుతున్నాయి.
నేడు, వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్ నుంచి పలు అవసరాలు తీరాలని కోరుకుంటున్నారు. వేగం, త్వరిత గతిన పనులన్నీ అయిపోవాలనుకోవడం కనిపిస్తుంది. ఈ స్ఫూర్తిని మరింతగా తీసుకువెళ్తూ పాప్ 5 ప్రో ను భారత్ వినియోగదారులు మరింత ముందుకు వెళ్లేందుకు తీర్చిదిద్దాము. ఈ పాప్ 5 ప్రో స్మార్ట్ఫోన్లు ప్రతిష్టాత్మక గ్రేడ్ స్మార్ట్ఫోన్లు. సమగ్రస్థాయి సామర్థ్యం వీటిలో ఉంది. ఇవి పూర్తి సామర్థ్యంను మరీ ముఖ్యంగా డిస్ప్లే, కెమెరా మరియు బ్యాటరీ తో అందిస్తుంది. తమ పోటీదారులను మించిన ఫీచర్లను ఈ స్మార్ట్ఫోన్లు అందిస్తాయి. ఈ పాప్ 5 ప్రో నగదుకు తగ్గ విలువను అందించడంతో పాటుగా నూతన స్ధాయిని అన్ని దశలలోనూ అందిస్తుంది. ఈ నూతన సంవత్సర వేళ మరింతగా తమను అభిమానించే వినియోగదారులకు పరిశ్రమలో అత్యున్నత స్ధాయి ఫీచర్లను సరసనమైన ధరల వద్ద అందిస్తుంది.
ఈ ఆవిష్కరణ గురించి అరిజీత్ తాలపత్ర, సీఈఓ, ట్రాన్సిషన్ ఇండియా మాట్లాడుతూ ‘‘టెక్నో వద్ద మా ప్రయత్నమెప్పుడూ కూడా ప్రీమియం సాంకేతికతను పరిశ్రమలో ఎన్నడూ చూడని ధరలలో అందించడం. వినియోగదారుల లక్ష్యిత బ్రాండ్‌గా, మా ప్రయత్నమెప్పుడూ కూడా యువ ఔత్సాహిక భారతావని అవసరాలు, కోరికలు, డిమాండ్లను ప్రతిధ్వనించే సాంకేతికతను రూపొందించడం. ఈ పాప్ 5 ప్రో ఈ నిబద్ధతకు ప్రతిరూపంగా నిలుస్తుంది. యువతను ఆకట్టుకునే రీతిలో అత్యున్నత శ్రేణి ఫీచర్లతో కూడిన ఫ్లాగ్షిప్ స్థాయి స్మార్ట్ఫోన్లను అందిస్తున్నాము. ఈ పూర్తి సరికొత్త పాప్ 5 ప్రోను మార్కెట్లలోకి విడుదల చేయడం ద్వారా నేటి యువ భారత్ హృదయాలలో విజయవంతమైన గుర్తింపును వదులుతుంది’’ అని అన్నారు.
పాప్ 5 ప్రో యొక్క కీలక యుఎస్పీలు:
పాప్ 5 ప్రో అత్యంత శక్తివంతమైన 6000 ఎంఏహెచ్ మెగా బ్యాటరీ, భారీ బ్యాటరీ 54 గంటల వరకూ ఏకధాటిగా మాట్లాడే అవకాశాన్ని లేదా 120 గంటల మ్యూజిక్ ప్లే బ్యాక్ అందిస్తుంది.
6.52 హెచ్డీ+ లీనమయ్యే డిస్ప్లే
90% స్ర్కీన్ టు బాడీ రేషియో, 269 పీపీఐ పిక్సెల్ డెన్సిటీతో, అతి పెద్ద 6.52 హెచ్డీ+ డిస్ప్లే ఉంది. ఇది వినియోగదారులకు ఈ విభాగంలో ప్రీమియం డిస్ప్లే అనుభవాలను అందిస్తుంది. 480 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్ కలిగిన ఈ స్ర్కీన్ స్పష్టంగా సూర్యకాంతిలో కూడా కనిపిస్తుంది. ప్రతి టచ్‌తోనూ పాప్ 5 ప్రో యొక్క మృదువైన అనుభవాలను 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్‌తో పొందవచ్చు.
3జీబీ భారీ ర్యామ్ మరియు 32 జీబీ అంతర్గత స్టోరేజీ
పాప్5 ప్రోలో 3జీబీ ర్యామ్ ఉంది. ఇది అత్యున్నత వేగం ల్యాగ్ ఫ్రీ అనుభవాలను అందిస్తుంది. దీనిలోని 32 జీబీ అంతర్గత స్టోరేజీ 256 జీబీ వరకూ ఎస్డీ కార్డ్స్ ద్వారా విస్తరించుకోవచ్చు. మీ రోజువారీ మల్టీమీడియా అవసరాలను తీర్చుకునేందుకు ఇది తగిన శక్తిని అందిస్తుంది.
8 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా
పాప్ 5 ప్రో కెమెరాలో 8మెగా పిక్సెల్ ఏఐ డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. ఇది అసాధారణ చిత్ర ప్రాసెసింగ్ సాంకేతికతను కలిగి ఉండటం వల్ల ప్రతి సారీ స్పష్టమైన చిత్రాలను తీయడం వీలవుతుంది. దీనిలో విభిన్నమైన విధానాలు అయినటువంటి ఏఐ పోట్రెయిట్, హెచ్డీఆర్, ఫిల్టర్లు మొదలైనవి మీ ఫోటోలకు మరింత అందాన్ని అందిస్తాయి. రాత్రి అయినా పగలైనా వినియోగదారులు అసాధారణ సెల్ఫీలను 5మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాతో కూడిన పాప్ 5 ప్రోతో తీసుకోవచ్చు. దీనిలో ఫ్రంట్ ఫ్లాష్ లైట్ వైడ్ ఎఫ్ 2.0 అపెర్చర్ ఉంది.