Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధర రూ.59.90 లక్షలు
న్యూఢిల్లీ : ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బిఎండబ్ల్యు భారత మార్కెట్లోకి కొత్త ఎక్స్3 ఎస్‌యువిని విడుదల చేసింది. ఇందులోని ఎక్స్3ఎక్స్ డ్రైవ్ 30ఐ స్పోర్ట్ ఎక్స్ ప్లస్ వేరియంట్ ధరను రూ.59.90 లక్షలుగా, ఎక్స్3ఎక్స్‌డ్రైవ్30ఐఎం ధరను రూ.65.90 లక్షలుగా నిర్ణయించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అత్యున్నతమైన డిజైన్‌తో దీన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఆ కంపెనీ తెలిపింది. పెట్రోల్ ఇంజిన్‌తో ఆవిష్కరించిన ఈ మోడళ్లు కేవలం 6.6 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని పుంజుకుంటుందని బిఎండబ్ల్యు గ్రూపు ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పహా తెలిపారు.