Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడో రోజూ నష్టాలు
- సెన్సెక్స్ 634 పాయింట్ల పతనం
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడితో వరుసగా మూడో రోజూ నష్టాల పాలయ్యాయి. చమురు ధరల పెరుగుదల, ఎఫ్ఐఐలు తరలిపోవడం, ద్రవ్యోల్బణ భయాలు మదుపర్ల విశ్వాసాన్నిద దెబ్బ తీస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య మూడు రోజుల్లో సెన్సెక్స్ దాదాపు 2 వేలకు పైగా పాయింట్ల పతనాన్ని చవి చూసింది. గురువారం సెషన్లో 634 పాయింట్లు కోల్పోయి 59,465కు పడిపోయింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 181 పాయింట్ల నష్టంతో 17,757 వద్ద ముగిసింది. ఇరు సూచీలు ఒక్కశాతం చొప్పున నష్టపోయాయి. అమ్మకాల ఒత్తిడితో నిఫ్టీలో ఐటి, ఫార్మా, ఎఫ్ఎంసిజి రంగాల సూచీలు 1.6 శాతం మేర విలువ కోల్పోయాయి. సెన్సెక్స్‌లో భారతీ ఎయిర్టెల్, ఏసియన్ పెయింట్స్, మారుతి సుజుకి, అల్ట్రాటెక్ సిమెంట్ సూచీలు గరిష్టంగా 5 శాతం వరకు లాభపడిన వాటిలో టాప్‌లో ఉన్నాయి. మరోవైపు ఇన్ఫోసిస్, టిసిఎస్, డాక్టర్ రెడ్డీస్ లాబరేటరీస్, హెచ్‌యుఎల్, సన్ ఫార్మా సూచీలు అధికంగా నష్టపోయిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి.
వచ్చే ఏడాది 7.6 శాతం వృద్థి
- ఇండియా రేటింగ్స్ అంచనా
వచ్చే ఆర్థిక సంవత్సరం (2022-23)లో భారత జీడీపీ 7.6 శాతం పెరగొచ్చని ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది. రెండేండ్ల తర్వాత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉండొచ్చని ఆ సంస్థ ప్రిన్సిపల్ ఎకనామిస్ట్ సునీల్ కుమార్ సిన్హా పేర్కొన్నారు. జీడీపీలో ప్రయివేటు వినిమయం, పెట్టుబడుల డిమాండ్ వరుసగా 43.4 శాతం, 21.0 శాతం చొప్పున వాటాలు కలిగి ఉండొచ్చన్నారు.
ఎఫ్‌డీఐల్లో 26 శాతం పతనం
గడిచిన ఏడాదిలో భారత్‌లోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)ల్లో 26 శాతం పతనం చోటు చేసుకుందని యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెఎన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ (యూఎన్‌సీటీఏడీ) ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. ప్రధానంగా 2020లో భారీగా విలీన, సంలీన ఒప్పందాలు జరగడంతో ఎఫ్‌డీఐల్లో భారీ పెరుగుదల ఉందని పేర్కొంది. కాగా ప్రపంచ దేశాల మొత్తం ఎఫ్‌డీఐల్లో మాత్రం పెరుగుదల ఉన్నట్టు తెలిపింది. 2020లో 929 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు నమో దైతే.. 2021లో 77 శాతం పెరిగి 1.65 లక్షల కోట్ల డాలర్లకు చేరినట్టు పేర్కొంది. భారత్ మినహా ఇతర వర్థమాన దేశాల ఎఫ్‌డీఐల్లో పెరుగుదల ఉన్నట్లు తెలిపింది. చైనాకు వచ్చే ఎఫ్‌డీఐలు 20 శాతం పెరిగి 179 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.