Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అంధత్వ ముఖ్య కారణాలపై కేంద్రీకరించే వివిధ అత్యుత్తమ శ్రేణి కేంద్రాలను అభివృద్ది చేయడంలో భాగంగా, రెటీనా సంబంధిత వ్యాధులకు ఒక అత్యుత్తమ శ్రేణి సంస్థ మరియు ఒక ప్రపంచ వనరుల కేంద్రం కోసం ఎల్ వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ బజాజ్ గ్రూపుతో భాగస్వామిగా ఉంటున్నది.
భాగస్వామ్యాన్ని క్రమబద్ధీకరించడానికి 2022 జనవరి 21వ తేదీన బజాజ్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బెల్) అధ్యక్షులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ శేఖర్ బజాజ్ మరియు ఎల్ వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ (ఎల్విపిఇఐ) ఎగ్జిక్యూటివ్ అధ్యక్షులు డా ప్రశాంత్ గర్గ్ ఒక ఒప్పందంపై సంతకాలు చేసారు. కీర్తిశేషులు శ్రీ అనంత బజాజ్ స్మృతిలో అనంత్ బజాజ్ రెటీనా ఇన్స్టిట్యూట్ అని పేరు పెట్టిన ఇది ఎల్విపిఇఐలో ఒక అంతర్భాగంగా ఉంటుంది. ఈ ఉత్తమ శ్రేణి సంస్థ మరిన్ని మిలియన్ల ప్రజలకు ఎల్విపిఇఐ వ్యవస్థ ప్రత్యక్ష సేవలద్వారా, సంస్థ అల్యుమ్నై, భాగస్వాముల పనిద్వారా, భారతదేశం, ప్రపంచంలోని ఇతర భాగాలలో సామర్ధ్య అభివృద్దిద్వారా అత్యుత్తమ నాణ్యతగల రెటీనా సంరక్షణను అందించడాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. వైద్య సంరక్షణతోపాటు, ఆఫ్థల్మాలజిస్టులకు మరియు ఇతర నేత్ర సంరక్షణా సిబ్బందికి శిక్షణనివ్వడం, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో ఇతర నేత్ర సంరక్షణా సంస్థల సామర్ధ్యాన్ని అభివృద్దిచేయడం, భారతదేశం, ఇతర అభివృద్ది చెందుతున్న దేశాలలో పరిశోధనా సామర్ధ్యాన్ని ప్రోత్సహించడానికి మరియు మెరుగుపరచడానికి, సామాజిక నేత్ర ఆరోగ్య కార్యక్రమాలను పెంచడం మరియు రెటీనా వ్యాధులకు మెరుగైన సంరక్షణకు సాంకేతికతను ఉపయోగించడంపై కేంద్రీకరణ ఉంటుంది.
అంధత్వ నివారణకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకార కేంద్రమైన ఎల్విపిఇఐ, నివారించగల అంధత్వ నిర్మూలనకు అంతర్జాతీయ కార్యక్రమాలలో ప్రముఖ పాత్ర వహిస్తున్నవారిలో ఒకరు. అన్ని రకాల అంధత్వాలను నియంత్రించడానికి మరియు ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం నుంచి జటిలమైన కంటి వ్యాధుల చికిత్స మరియు పునరుద్ధరించలేని అంధుల పునరావాసంద్వారా అత్యుత్తమ శ్రేణి కేంద్రాలను మరియు ప్రపంచ స్థాయి వనరుల కేంద్రాలను అభివృద్దిచేయడం ఎల్విపిఇఐ వ్యూహాత్మక కేంద్రీకరణ రంగాలలో ఒకటి. అనంత్ బజాజ్ రెటీనా ఇన్స్టిట్యూట్ అటువంటి ఒక కార్యక్రమం. శేఖర్ బజాజ్ మరియు బజాజ్ గ్రూపుతో భాగస్వామ్యంపట్ల మేము ఎంతో సంతోషిస్తున్నాము అని ఎల్ వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఎగ్జిక్యూటివ్ అధ్యక్షులు డా ప్రశాంత్ గర్గ్ అన్నారు.
బజాజ్ ఎలెక్ట్రికల్ లిమిటెడ్ (బెల్) అధ్యక్షులు, మేనేజింగ్ డైరెక్టర్ శేఖర్ బజాజ్ మాట్లాడుతూ.. 'నితమ రెటీనా కేంద్రానికి అనంత్ బజాజ్ రెటీనా ఇన్స్టిట్యూట్ అని పేరుపెట్టినందుకు ఎల్విపిఇఐకి బజాజ్ కుటుంబం ధన్యవాదాలు తెలుపుకుంటున్నది. తన శ్రేష్టత మరియు నేత్ర సంరక్షణకు ప్రపంచ స్థాయి సేవను అందించడంలో ఆవిష్కరణకు పేరెన్నికగన్న సంస్థతో భాగస్వాములమవడానికి మేము సంతోషిస్తున్నాము. ఎల్విపిఇఐ మరియు అనంత్ బజాజ్ రెటీనా ఇన్స్టిట్యూట్ సమిష్టిగా అందరికీ, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలోనివారికి నివారణ మరియు పునరావాస అందించడానికి సేవలను బహుళ నేత్ర సంరక్షణా కేంద్రాలద్వారా ఒక పెద్ద మార్పును తీసుకురాగలమని మేము విశ్వసిస్తున్నాము. అనంత్ బజాజ్ రెటీనా ఇన్స్టిట్యూట్ ప్రారంభంతో, మెరుగైన నేత్ర ఆరోగ్యం ఉన్న భారతదేశంగురించిన ఆయన సంకల్పం నిజమవుతుంది` అన్నారు,
అనంత్ బజాజ్ రెటీనా ఇన్స్టిట్యూట్. వ్యవస్థ అధినేతడా రాజా నారాయణన్, మాట్లాడుతూ..
'దృష్టి హాని కలిగించే రెటినా సంబంధిత సమస్యల కొన్ని ఉదాహరణలు డయాబిటిక్ రెటినోపతి, మాక్యులర్ డీజనరేషన్, రెటినల్ డిటాచ్మెంట్, రెటినిటిస్ పిగ్మెంటోసా మరియు ఇతర వంశానుగత రెటీనా వ్యాధులు, మరియు రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ. రెటినల్ వ్యాధులవలన రాగల అంధత్వం మరియు దృష్టి వైకల్యం త్వరితంగా నిర్ధారణ చేసి, సత్వరంగా చికిత్స చేయగలిగితే నియంత్రించవచ్చు మరియు నిర్వహించవచ్చు. బజాజ్ గ్రూపునకు వారి ఉదార మద్దతుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము` అని అన్నారు.