Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : జీవిత బీమా సంస్థ టాటా ఎఐఎ లైఫ్ ఇన్సూరెన్స్ (టాటా ఎఐఎ లైఫ్) తమ పంపిణీ వ్యవస్థను మరింత విస్తరించినట్లు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో కొత్తగా తొమ్మిది నూతన శాఖలను ప్రారంభించినట్లు ఆ సంస్థ పేర్కొంది. వీటిని శ్రీకాకుళం, కర్నూలు, రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, కడప, హైదరాబాద్, ఖమ్మం, నిజామాబాద్‌లలో ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాలలో 247 నగరాలలో 314 శాఖలను నిర్వహిస్తోన్నట్లు వెల్లడించింది