Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : నిప్పన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ కొత్తగా సిల్వర్ ఇటిఎఫ్ను ఆవిష్కరించింది. ఈ ఫండ్లో సమీకరించిన నిధులను భౌతిక వెండి, వెండి సంబంధిత పరికరాల్లో పెట్టుబడులుగా పెట్టనుంది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్ఒ) జనవరి 13న తెరువబడిందని.. ఈ నెల 27తో ముగియనుందని ఆ సంస్థ తెలిపింది. ఇందులో కనీసం రూ.1,000 నుంచి పెట్టుబడులకు అనుమతిస్తున్నట్లు పేర్కొంది.