Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫిక్కీతో సోహర్ పోర్ట్ జట్టు
హైదరాబాద్ : భారత్, ఒమన్ దేశాల మధ్య విస్తృత వ్యాపార అవకాశాలు ఉన్నాయని సొహర్ పోర్ట్ అండ్ ఫ్రీ జోన్ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఇఒ ఒమర్ అల్ మహ్రిజి పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న వ్యాపార అవకాశాల సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి ఫిక్కీతో సుల్తానేట్ ఆఫ్ ఒమన్ కు చెందిన సోహర్ పోర్ట్ అండ్ ఫ్రీ జోన్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 'ఫోర్జింగ్ అహెడ్ ఇన్ మెటల్స్ టు మాగ్జిమైజ్ యువర్ మార్కెట్ రీచ్' అనే అంశంపై జనవరి 25న చర్చ జరుగనుంది. సోహర్ పోర్ట్ ద్వారా ప్రయోజనాలు పొందుతున్న భారత కంపెనీల విజయాలు ఇక్కడ చర్చకు రానున్నాయని మహ్రిజి పేర్కొన్నారు. భారత్‌కు ఒమన్ 35వ అతిపెద్ద ఎగుమతి మార్కెట్‌గా ఉంది. ఫ్రీజోన్‌లో మొత్తం పారిశ్రామిక పెట్టుబడులలో 35 శాతం భారతీయ ఇన్వెస్టర్లవే. అందులోనూ 50 శాతం లోహ క్లస్టర్ల నుంచి వచ్చినవే కావడం విశేషం.