Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ ఇంజినీరింగ్ ఆధారిత, రిస్క్ ఫోకస్డ్ లెండింగ్ ప్లాట్‌ఫామ్ ప్రోటియం, ఇప్పుడు నేషనల్ ఇండిపెండెంట్ స్కూల్స్ అలయన్స్ (నిసా)తో అధికారికంగా ఫైనానింగ్ భాగస్వామిగా ఒప్పందం చేసుకుంది. నిసాకు అనుబంధంగా ఉన్న 55,400 పాఠశాలలకు ఆర్థిక పరిష్కారాలను ప్రోటియం అందించనుంది. గతంలో ప్రొటియం, తెలంగాణా గుర్తింపు పొందిన పాఠశాలల మేనేజ్మెంట్స్ అసోసియేషన్ (ట్రస్మా)తో భాగస్వామ్యం చేసుకుంది. గత డిసెంబర్లో ఈ కంపెనీ, నిసా నిర్వహించిన మంతన్ సదస్సులో మహమ్మారి ప్రభావం బారిన పడిన 500 పాఠశాలలకు రుణ సదుపాయాలను అందించనున్నట్లు వెల్లడించింది.
ప్రొటియం మేనేజింగ్ డైరెక్టర్ ధృవ్ సూరి మాట్లాడుతూ 'మహమ్మారి ప్రభావం పలు దేశాలలో తీవ్రంగా ఉండటంతో పాటుగా పలు పరిశ్రమలు, రంగాలు ప్రభావితమయ్యాయి. విద్యా రంగం అందుకు మినహాయింపేమీ కాదు. అల్పాదాయ, మధ్య తరహా ఆదాయం కలిగి మహమ్మారి చేత ప్రభావితమైన పాఠశాలల పునర్నిర్మాణం కోసం తోడ్పడే అవకాశం అందించడం ద్వారా ప్రతి ఒక్కరికీ విద్య అందించాలన్నది మా లక్ష్యం. నిసాతో మా భాగస్వామ్యంతో ఈ లక్ష్యం చేరుకోగలమని భావిస్తున్నాము` అని అన్నారు.
'కోవిడ్ 19 కారణంగా లక్షలాది మంది చిన్నారులు అభ్యాస పరంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఈ అంతరాలను పూరించేందుకు మేము ప్రయత్నిస్తున్నాము. సౌకర్యవంతమైన అభ్యాస అనుభవాలను యువత పొందాలని మేము కోరుకుంటుంటాము. కేవలం పాఠశాలలు మాత్రమే దానిని సాధ్యం చేయగలవు. ఈ కారణం చేతనే వాటిని ఆర్ధికంగా పటిష్టం చేస్తున్నాము` అని అన్నారు.
నిసా అధ్యక్షులు డాక్టర్ కుల్భూషన్ శర్మ మాట్లాడుతూ.. 'గత రెండు సంవత్సరాలుగా, కోవిడ్ 19 కారణంగా ప్రతి రంగమూ ప్రభావితమైంది. విద్యారంగం అందుకు మినహాయింపేమీ కాదు. తక్కువ ఫీజుల కలెక్షన్స్, ప్రస్తుత ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ చేరుకోవడం పెద్ద సవాల్‌గా పాఠశాలలకు మారింది. చరిత్రలో మొదటిసారిగా విద్యార్థులు మంచాల మీద, డిన్నర్ టేబుల్స్ మీద కూర్చుంటే, టీచర్లు స్ర్కీన్లను చూస్తూ బోధించాల్సిన విషమ పరిస్థితి వచ్చింది. మహమ్మారి నుంచి మనం నెమ్మదిగా కోలుకుంటున్న వేళ పాఠశాలలు ఉన్నత లక్ష్యాలను ఏర్పరుచు కుంటున్నాయి. అత్యున్నత నాణ్యత కలిగిన మౌలిక వసతులు పొందేందుకు పాఠశాలలకు తగిన ఆర్ధిక పరిపుష్టత లేదు. ప్రొటియం సాక్షర లాంటి ఆర్థిక సంస్థలు ఇక్కడ ప్రభావం చూపుతున్నాయి. పాఠశాలలకు రుణాలను అందించడం ద్వారా మెరుగైన భవిష్యత్ నిర్మాణానికి తోడ్పడుతున్నాయి` అని అన్నారు.