Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఇండియా, 2020 మార్చి నుండి రెండు వినాశకారక వేవ్‌ల ద్వారా కరోనావైరస్ వ్యాప్తిని అనుభవించి ఇప్పుడు అత్యధిక సాంక్రామిక ఎస్ఎఆర్ఎస్-CoV-2 వైరస్ వేరియంట్చే నడపబడుతున్న మూడో వ్యాప్తిని ఎదుర్కొంటోంది. ప్రస్తుతం వైరస్ సోకిన వారి సంఖ్య 3,73,80,253 (జనవరి 17 వ తేదీ ఉదయం 8 గంటల సమయానికి)1 అనేది 1.3 బిలియన్ జనాభా కలిగిన దేశములో ఎక్కువ సంఖ్యగా అనిపించకపోవచ్చు కానీ, ఇతర దేశాలలో ఈ వేరియంట్ యొక్క శీఘ్రమైన వ్యాప్తి - వాటిలో అనేక దేశాలలో ఇప్పుడు కనిపిస్తున్న నాటకీయ ఉప్పెనలు - అవి చాలు ఆరోగ్య నిపుణులు భయపడడానికి. ఇప్పటివరకూ, మునుపటి వేరియంట్ల కంటే ఒమైక్రాన్ స్వల్ప వ్యాధి లక్షణాలు మరియు తక్కువగా ఆసుపత్రి చేరికలకు కారణమవుతున్నట్లుగా, ప్రత్యేకించి పూర్తిగా టీకాలు వేయించుకున్న వ్యక్తులలో తక్కువగా ఉన్నట్లుగా ఇతర దేశాల నుండి డేటా సూచిస్తోంది, అయినప్పటికీ తదుపరి అధ్యయనాలు మరియు డేటా ఇంకా రావాల్సి ఉంది. ఇండియాలో ప్రస్తుతం కోలుకుంటున్న వారి రేటు 94.27%1వద్ద నిలిచి ఉంది. అయితే ఈ స్ట్రెయిన్ తక్కువ ప్రాణాంతకమైనది అయినప్పటికీ, దీని యొక్క అధికమైన వ్యాప్తితత్వము ఇంకా ఇండియా యొక్క భారీ జనాభా పరిమాణమును బట్టి దానివల్ల ఇంకా అధిక సంఖ్యలో సోకుదలలు ఉండవచ్చునని అనిపిస్తోంది.
నేటికి రెండు మోతాదుల టీకాల కవరేజీ సుమారుగా 65.80 కోట్లుగా ఉన్నప్పటికీ, ఒమైక్రాన్ వంటి అధిక పరివర్తన చెందిన వేరియంట్ యొక్క ముప్పు ఉండడం ఇంకనూ వాస్తవమైన విషయము. అర్హత గల జనాభా అందరూ తీవ్రమైన వ్యాధి నుండి సముచితమైన రక్షణ కోసం వెంటనే మరియు అత్యవసరంగా తప్పనిసరి చేయబడినటువంటి ముందుజాగ్రత్త అదనపు మోతాదుతో సహా తమ రెండు-మోతాదుల టీకాలను పూర్తిగా తీసుకునేటట్లుగా చూసుకోవాలి. ఇండియాలో అనేకమంది మాస్కును ధరించడం ఆపి వేయడం, ఇంతకు మునుపు కంటే తక్కువగా పరీక్ష చేయించుకోవడం, మరియు పెద్ద సంఖ్యలో మనుషులు గుమికూడడం వంటి సంఘటనలు జరుగుతున్నాయనే వాస్తవముచే ఇండియాలో వైరస్ శీఘ్రంగా వ్యాపిస్తున్న ముప్పు లెక్క కట్టబడింది. స్పుత్నిక్ వి అనేది, 91.6%3 నిర్ధారిత సామర్థ్యముతో ప్రపంచములో కోవిడ్-19 పై నమోదు చేసుకోబడిన మొట్టమొదటి టీకామందుగా ఉంది3. రెండు విభిన్న వాహకాల వాడకం అనేది ఇతర అడెనోవైరస్ వెక్టర్-ఆధారిత వ్యాక్సీన్ల కంటే రష్యా వ్యాక్సీన్‌ని విభిన్నమైనదిగా చేస్తూ గామలెయా సెంటర్ యొక్క విశిష్టమైన సాంకేతిక పరిజ్ఞానంగా ఉంది. ఈ విశిష్టమైన ప్రైమ్-బూస్ట్ ఇమ్యునైజేషన్ విధానము(హెటెరోలోగస్ ఇమ్యునైజేషన్) దీని ఆవిష్కరణ తర్వాత ప్రపంచవ్యాప్తంగా జరిపిన అనేక అధ్యయనాలలో చక్కగా మదింపు చేయబడింది.4
గామలెయా సెంటర్ యొక్క ఇటీవలి ప్రాథమిక ప్రయోగశాల అధ్యయనము5, స్పుత్నిక్ వి టీకామందు ఒమైక్రాన్ (బి.1.1.529) వేరియంట్‌పై అధిక వైరస్ తటస్థీకరణ చర్యను ప్రదర్శించినట్లుగా తెలియజేస్తోంది మరియు వ్యాధి తీవ్రత మరియు ఆసుపత్రి చేరికపై బలమైన రక్షణను అందిస్తుందని ఆశించబడుతోంది. స్పుత్నిక్ వి యొక్క దీర్ఘకాలం నిలిచి ఉండే రక్షణకు సూచికగా, 21 రోజుల ఎడముతో రెండు మోతాదుల ప్రాథమిక వ్యాక్సినేషన్ తర్వాత (ప్రాథమిక టీకా వేసిన తర్వాత 6 నెలలకు మించి) ఎక్కువ కాలవ్యవధితో సెరాను ఉపయోగించి ఈ అధ్యయనము నిర్వహించబడింది. ఈ అధ్యయనములో స్పుత్నిక్ వి వ్యాక్సీన్5 ఒక బలమైన మరియు దీర్ఘకాలం నిలిచి ఉండే సెల్యులర్ రోగనిరోధకశక్తి స్పందనను కూడా ప్రదర్శించింది మరి అందువల్లనే తీవ్రమైన వ్యాధిపై దీర్ఘకాలం నిలిచి ఉండే రక్షణను అందిస్తుందని ఆశించబడుతోంది.