Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: దేశంలో కీలకమైన మరియు అత్యుత్తమైన సామాజిక ప్రభావాన్ని కలిగించే పని కోసం కృషి చేస్తున్న 100 ఎన్జీఓలు పలు ప్రతిష్టాత్మకమైన ఫండింగ్ భాగస్వాములతో పాటు ఎడెల్ గివ్ ఫౌండేషన్ చే మద్దతు చేయబడే గ్రో ఫండ్ ద్వారా నిధులు అందుకోవడానికి ఎంపిక చేయబడ్డాయి. ఎంపిక చేయబడిన 100 ఎన్జీఓలలో, తెలంగాణాలకి చెందిన 3 సంస్థలు సమూహంలో భాగంగా ఉన్నాయి. చొరవ యొక్క 100 సంస్థల సమూహంలో భాగంగా ఎంపిక చేయబడే ప్రతి ఎన్జీఓ తమ సామర్థ్యాలు రూపొందించడానికి, తిరిగి పుంజుకోవడానికి మరియు భవిష్యత్తులో సంసిద్ధత కోసం వనరుల్ని మళ్లించడానికి రెండేళ్లు రూ. 80 లక్షలు అందుకుంటారు. 2300కి పైగా సంస్థలు నుండి అందుకున్న రిజిస్ట్రేషన్స్ తో ఎన్జీఓలు మార్గదర్శకత్వం, నెట్ వర్కింగ్ మరియు నాయకత్వ రూపకల్పనలు కూడా సహాయపడతాయి. కోవిడ్ -19 వలన ఎందుర్కొన్న తక్షణ సవాళ్లు నుండి కోలుకోవడానికి మరియు కీలకమైన ఖర్చులను కవర్ చేయడం ద్వారా కార్యకలాపాలను సుస్థిరం చేయడానికి మరియు దీర్ఘకాలం సంస్థాపరమైన సంక్షేమం మరియు సుస్థిరతలు కోసం భవిష్యత్తు సంసిద్ధతని ప్రోత్సహించడానికి కూడా ఇది సంస్థలకు వీలు కల్పిస్తుంది.
తెలంగాణా నుండి ఎంపిక చేయబడిన ఎన్జీఓలు - హీలింగ్ ఫీల్డ్స్ ఫౌండేషన్; మై ఛాయిసెస్ ఫౌండేషన్ మరియు ఎస్ఏఎఫ్ఏ సొసైటీ, ఆరోగ్యం మరియు పారిశుద్ధ్యం & లింగ హక్కులు మరియు సమానత్వం వంటి వివిధ రంగాలలో ప్రభావాన్ని కలిగిస్తున్నాయి. కోవిడ్-19 పురోగమించిన నాటి నుండి భారతదేశంలో వివిధ వర్గాలకు సేవలు అందిస్తున్న అట్టడుగు సంస్థలు నిధులు తగ్గిపోవడం మరియు బలవంతంగా మూసివేయబడే ప్రమాదం సహా తమ వృద్ధి మరియు నిలదొక్కుకోవడంలో పలు సమస్యల్ని అనుభవించాయి. తమ సంస్థల అభివృద్ధి అవసరాల్ని పరిష్కరించడం ద్వారా సంస్థలు తిరిగి పుంజుకునేలా మరియు భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండేలా చేయడానికి అనుకూలమైన వాతావరణాన్ని రూపొందించడానికి కట్టుబడటం ద్వారా దాతృత్వాన్ని పునర్నిర్వచించే లక్ష్యంగా గల ‘ద గ్రో ఫండ్’ ఒక విలక్షణమైన ఆర్థిక చొరవ.
దాతృత్వం మరింత సమీకృతంగా చేయడానికి మరియు చిన్న, మధ్యస్థ పరిమాణం గల ఎన్జీఓలకు అందుబాటులో ఉండటానికి ‘ద గ్రో ఫండ్’ తన మిషన్ కోసం దాతృత్వ సంస్థలు మరియు తమ వ్యక్తిగత దానాలకు పేరు పొందిన ప్రముఖ దాతలు సహా భారతదేశం మరియు అంతర్జాతీయ ఫండర్స్ నుండి ప్రశంశలు మరియు వనరులు అందుకుంది. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్, మనన్ ట్రస్ట్, రోహిణి నీలేకని ఫిలాంత్రోపీస్, మెక్ ఆర్థర్ ఫౌండేషన్, ఏ.టీ.ఈ చంద్ర ఫౌండేషన్, రెయిన్ మ్యాటర్ ఫౌండేషన్, దల్యన్ ఫౌండేషన్, ఓక్ ఫౌండేషన్, ఒక ప్రైవేట్ దాతృత్వ భాగస్వామి, ఇండస్ ఫౌండేషన్ ఆఫ్ ఉటా, ఒమిడ్యార్ నెట్ వర్క్ ఇండియా అండ్ ఆషిష్ కచోలియాతో పాటు ఎడెల్వీస్ గ్రూప్ లు ఈ చొరవలో ప్రధానమైన దాతలుగా ఉన్నాయి. అదనంగా, ప్రముఖ వ్యాపారులు మరియు సంజయ్ పురోహిత్, రాటి ఫోర్బ్స్, బిక్ చందాని కుటుంబం, హెలెంకా & సునీల్ ఆనంద్, ఆన్ వర్డ్ ఫౌండేషన్ మరియు గోవింద్ అయ్యర్ వంటి సమాజం కోసం పాటుపడే వారు కూడా ‘గ్రో ఫండ్’ కి తమ వంతు సహాయం అందించారు.
సమూహం గురించి చేసిన ప్రకటన పై వ్యాఖ్యానిస్తూ, విద్యా షా, ఎగ్జిక్యూటివ్ ఛైర్ పర్సన్, ఎడెల్ గివ్ ఫౌండేషన్ ఇలా అన్నారు, " గ్రో ఫండ్ గ్రాంటీస్ కోసం దేశంలో 20 రాష్ట్రాలు నుండి ఎంపికైన సమూహంలో తెలంగాణా కి చెందిన 3 ఎన్జీఓలు చేర్చబడటం మాకు ఆనందాన్ని కలిగించింది. ఈ అట్టడుగు సంస్థలు ఆరోగ్యం మరియు పారిశుద్ధ్యం & లింగ హక్కులు మరియు సమానత్వం వంటి విభిన్న రంగాలలో రాష్ట్రంలో సమాజంలోని అట్టడుగు వర్గాలు కోసం నిరంతరంగా కృషి చేస్తున్నాయి. ఆర్థిక సహాయంతో పాటు, తెలంగాణాకి చెందిన ఎన్జీఓలు, టెక్నాలజీ, ఫైనాన్స్, మానవ వనరులు, నిధులు సమీకరణ మరియు కమ్యూనికేషన్స్ వంటి అంశాలు పై శిక్షణలు మరియు సమావేశాలు నుండి తెలంగాణా కి చెందిన ఎన్జీఓలు ఎంతగానో ప్రయోజనం పొందుతాయి. ఇది సంస్థాపరమైన అభివృద్ధి సాధనం, ప్రత్యేకమైన 12-14 నెలలు కార్యక్రమం మరియు గ్రో హబ్ విజ్ఞాన వ్యాప్తి వేదికతో జత చేయబడుతుంది. కోవిడ్ -19 కారణంగా ఎదుర్కొన్న సమస్యల్ని అధిగమించడానికి మరియు ఈ సమాజ సేవకులకు వీలు కల్పించడానికి మరియు వారు చేసే కృషిలో ప్రభావాన్ని పెంచడంలో మా నిబద్ధతకు మేము కట్టుబడి ఉంటాము.”
గ్రో ఫండ్ యొక్క లక్ష్యం గురించి మాట్లాడుతూ, నఘ్మా ముల్లా, సీఈఓ, ఎడెల్ గివ్ ఫౌండేషన్ ఇలా వ్యాఖ్యానించారు, "సమాజంలో బలహీన వర్గాలు కోసం కృషి చేసే అట్టడుగు సంస్థలు వాస్తవంలో వివిధ సమస్యలకు సుస్థిరమైన ప్రణాళికల్ని రూపొందించడంలో అత్యంత ప్రభావవంతమైనవని మేము విశ్వసిస్తాము. గ్రో ఫండ్ ద్వారా, భారతదేశంలో ఎన్జీఓలని బలోపేత్తం చేసి మరియు మద్దతు చేయడానికి సహకార దాతృత్వాన్ని తీసుకురావాలని లక్ష్యాన్ని కలిగి ఉన్నాము. మా ఫండర్ సంస్థలు మరియు దాతలు యొక్క ఉదారమైన మద్దతుకి కృతజ్ఞతలు. ప్రస్తుత నిధి తెలంగాణాలు సహా ఎంపిక చేయబడిన 100 ఎన్జీఓలు కోసం ఖచ్చితంగా ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తుంది మరియు భవిష్యత్తులో అలాంటి సహకారాలుకోసం మార్గాన్ని నిర్మిస్తుంది.” ఎంపిక చేయబడిన 100 ఎన్జీఓలు , ఆన్ లైన్ లో దరఖాస్తు ప్రక్రియ ద్వారా బహిరంగంగా మరియు పారదర్శక విధానం ద్వారా ఎంపికయ్యాయి. ప్రతి దరఖాస్తు ఆర్థిక శక్తి, నిధుల్ని సమీకరించే సామర్థ్యం, చేరుకోవడం, ప్రభావం మరియు ఫండింగ్ కి సంబంధించిన కీలకమైన అంతరాలు వంటి ప్రామాణాలకు సంబంధించిన గుణాత్మకమైన మరియు పరిమాణాత్మకమైన సమాచారం ఆధారంగా మూల్యాంకనం చేయబడింది. భారతదేశంలో అన్ని ప్రాంతాలు నుండి సమానమైన ప్రాతినిధ్యాన్ని నిర్థారించడానికి, జమ్ము & కాశ్మీర్, ఉత్తర్ ప్రదేశ్, హర్యాణా, పంజాబ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, నాగాలాండ్, అస్సామ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిషా, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణా సహా వివిధ భూభాగాలకు చెందిన ఎన్జీఓలతో సమూహం ప్రాతినిధ్యంవహిస్తుంది.
ఎడెల్ గివ్ ఫౌండేషన్ గురించి
ఎడెల్ గివ్ ఫౌండేషన్ నిధుల్ని సమీకరించే సంస్థ మరియు భారతదేశపు అభివృద్ధి వ్యవస్థతో నిమగ్నమవ్వాలని కోరుకునే భారతీయ మరియు విదేశీ ఫండర్స్ కోసం తాము కోరుకునే భాగస్వామి. ఎన్జీఓలకు ప్రారంభపు నిధులు కేటాయించడం ద్వారా మరియు ఇతర సంస్థాపరమైన మరియు కార్పొరేట్ ఫండర్స్ నుండి నిధుల్ని నిర్వహించడం ద్వారా మా విలక్షణమైన దాతృత్వ నమూనా ఎడెల్ గివ్ ని నిధుల సమీకరణలో ప్రధాన స్థానంలో ఉంచుతుంది. ఫలితంగా నేడు, ఎడెల్ గివ్ నిధులు సమీకరించే వారు మరియు నమ్మకమైన ఎన్జీఓలు మధ్య దాతృత్వపు ఫండ్ మేనేజర్ గా మరియు సలహాదారుగా పని చేస్తోంది. గత 13 సంవత్సరాలకు పైగా, ఎడెల్ గివ్ ఫౌండేషన్ భారతదేశంలోని 14 రాష్ట్రాలలో 111 జిల్లాలో 150కి పైగా సంస్థల్ని మద్దతు చేసింది, రంగంలో ఎన్జీఓలకు దాదాపు రూ. 500 కోట్లు నిబద్ధతని ప్రభావితం చేసింది.