Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: నేడు, డిస్నీ+ హాట్‌స్టార్ త్వరలో విడుల చేయనున్న మార్వెల్ స్టూడియోస్ సిరీస్ ‘‘మూన్ నైట్’’కు సంబంధించిన థ్రిల్లింగ్, సరి కొత్త ట్రైలర్‌ను విడుదల చేసింది. ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు మరియు మలయాళ భాషల్లో మార్చి 30 నుంచి డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ కానున్న ఒరిజినల్, లైవ్-యాక్షన్ సిరీస్ కోసం కొత్త పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ సిరీస్‌లో స్టీవెన్ గ్రాంట్ అనే మృదు స్వభావం కలిగిన గిఫ్ట్-షాప్ ఉద్యోగి, అతని జీవితంలో మరో జన్మకు సంబంధించిన బ్లాక్అవుట్లు మరియు జ్ఞాపకాలతో బాధపడుతుంటాడు. స్టీవెన్ తనకు డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ ఉందని తెలుసుకుంటాడు మరియు కిరాయి సైనికుడు మార్క్ స్పెక్టర్‌తో తన శరీరాన్ని పంచుకున్నట్లు గుర్తిస్తాడు. స్టీవెన్/మార్క్ శత్రువులు వారికి ఎదురు పడుతుండడంతో, వారు ఈజిప్ట్‌లోని శక్తివంతమైన దేవుళ్లకు సంబంధించిన ఒక ఘోరమైన రహస్యాలను అన్వేషిస్తూ వెళుతున్నప్పుడు వారి సంక్లిష్ట గుర్తింపులను నావిగేట్ చేస్తారు. ‘‘మూన్ నైట్’’లో ఆస్కార్ ఐజాక్, ఏతాన్ హాక్ మరియు మే కాలమావి నటించారు. మొహమ్మద్ డయాబ్, జస్టిన్ బెన్సన్ మరియు ఆరోన్ మూర్హెడ్ బృందం ఈ ఎపిసోడ్లకు దర్శకత్వం వహించారు. జెరెమీ స్లేటర్ ప్రధాన రచయిత కాగా, కెవిన్ ఫీగే, లూయిస్ డి'ఎస్పోసిటో, విక్టోరియా అలోన్సో, బ్రాడ్ విండర్బామ్, మొహమ్మద్ డయాబ్, జెరెమీ స్లేటర్ మరియు ఆస్కార్ ఐజాక్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరించారు. గ్రాంట్ కర్టిస్, ట్రెవర్ వాటర్సన్ మరియు రెబెక్కా కిర్ష్ సహ-ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు.