Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఏళ్ల తరబడి దేశ సేవ చేసిన తర్వాత, విజయవంతమైన మిషన్లలో పాల్గొన్న అనంతరం
మిలటరీ వెటరన్లు కార్పొరేట్ జీవితాన్ని ఆన్వేషించుకుంటూ, దేశానికి ప్రత్యేకమైన రీతిలో సేవలు అందించేందుకు తమ విశిష్ఠమైన అనుభవాన్ని అందిస్తున్నారు. అమెజాన్ ఇండియా ఆపరేషన్స్‌లో అమూల్యమైన అనుభవాలు మరియు విశిష్ట నైపుణ్యాలతో మిలటరీ వెటరన్లు విలక్షణమైన టాలెంట్ పూల్‌ను ఏర్పరుస్తారు. ఇది కంపెనీ డైవర్సిటీ, ఈక్విటీ మరియు ఇన్‌క్లూజన్‌కు సంబంధించిన నిబద్ధతను
బలోపేతం చేస్తుంది. అమెజాన్ ఇండియా దేశానికి సేవ చేసిన వారి సూత్రాలు మరియు పని విధానానికి సంబంధించిన అంశాలను గౌరవిస్తుంది మరియు వారి కస్టమర్ల తరుపున గొప్పగా ఆలోచించే, ఇన్వెంట్ మరియు సరళీకృతం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నారని విశ్వసిస్తుంది.
సైనిక అనుభవజ్ఞుల కోసం బలమైన నిర్మాణం మరియు అంకితమైన ప్రోగ్రామ్‌తో, అమెజాన్ వారిని స్వాగతిస్తూ, విజయవంతమైన కెరీర్‌ను సాఫీగా కొనసాగించేందుకు వారికి సహాయపడుతుంది. దాదాపు 24 ఏళ్లు సైన్యంలో సేవలు అందించిన తర్వాత, సంజీవ్ మే 2020లో అమెజాన్‌లో ఆపరేషన్స్ లీడర్‌గా చేరారు. వారు గొప్ప కార్యాచరణ అనుభవంతో వచ్చారు మరియు ఆఫ్రికాలోని యుఎన్ మిషన్‌లో దేశవ్యాప్తంగా మరియు విదేశాలలో అనేక బాధ్యతలను నిర్వహించారు. వారి మాటల్లో - ‘‘అమెజాన్ నాయకత్వ సూత్రాలు సాధారణంగా సైనిక వ్యక్తుల నుంచి ఆశించిన వాటిని సేకరించుకుంటాయి. యాజమాన్యం, ఫలితాలను అందించడం మరియు అత్యున్నత ప్రమాణాలకు కట్టుబడి ఉండడం వంటి సూత్రాలు మిలిటరీ విధానంతో దృఢంగా ప్రతిధ్వనిస్తాయి, అప్పుడే అతను/ఆమె సైన్యానికి దూరంగా
ఉన్నామని భావించరు’’ అని పేర్కొన్నారు.
అమెజాన్ పని చేసే వేగానికి ఉదాహరణగా సంజీవ్ తన 20 నెలల అమెజోనియన్గా ఇప్పటికే 3 బాధ్యతలను నిర్వహించారు. ఆయన ఒక పెద్ద క్రమబద్ధీకరణ కేంద్రానికి సైట్ లీడ్‌గా తన విధులను ప్రారంభించి, తన బృందానికి శక్తినిచ్చారు మరియు కోవిడ్ వేవ్- 1 సమయంలో తన సిబ్బందిని ముందుకు నడిపించారు. కోవిడ్ వేవ్-2 సమయంలో ఆయన మధ్య భారతదేశంలో ఆరు స్టోరు సెంటర్లను నిర్వహించారు. సంజీవ్ ప్రస్తుతం వేగం, వినియోగదారుల అనుభవం మరియు ఖర్చును మెరుగుపరచడంపై దృష్టి సారించి, ప్రధాన నిర్మాణ సంస్కరణలను అమలు చేస్తున్నారు. సంజీవ్ తన సైట్లలో నిజంగా విభిన్నమైన మరియు సమగ్రమైన పని వాతావరణాన్ని నిర్మించే దిశగా పనిచేశారు. మాట్లాడే మరియు వినికిడి లోపం ఉన్న (SHI) సహచరులతో మెరుగైన సంభాషణ కోసం సంకేత భాష నేర్చుకునేందుకు, కార్యాచరణ నాయకులను ప్రోత్సహించేందుకు ‘లెట్ అజ్ టాక్’ వంటి డ్రైవ్‌లను
ప్రారంభించారు మరియు అమెజాన్- ఎర్స్త్ బెస్ట్ ఎంప్లాయర్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నందుకు నిజంగా సంతోషిస్తున్నారు.
సంస్థ ఆపరేషన్స్ నెట్‌వర్క్‌లో భాగంగా పనిచేస్తున్న వేలాది మంది అనుభవజ్ఞుల్లో సంజీవ్ ఒకరు.
అమెజాన్ ఇండియా మాజీ సైనికులు మరియు మహిళలకు దేశానికి సేవ చేసిన తర్వాత సంతృప్తికరమైన మరియు విజయవంతమైన కెరీర్‌ను రూపొందించుకోవడంలో సహాయపడేందుకు పలు అవకాశాలను సృష్టించింది. ఇందులో వ్యక్తిగత సహకారం మరియు నిర్వాహక పాత్రలు తన ఫుల్ఫిల్మెంట్ నెట్వర్క్, సార్ట్సెంటర్ నెట్వర్క్ మరియు లాస్ట్ మైల్లో ఉంటాయి. సంస్థ 2025 నాటికి 25,000 మంది సైనిక
అనుభవజ్ఞులను నియమించుకోవడం మరియు భవిష్యత్తులో వారి బలాలు మరియు సామర్థ్యాలను వినియోగించుకునే అవకాశాలను అందించాలనే అమెజాన్ వారి గ్లోబల్ విజన్‌లో భాగంగా ఈ అంశమూ ఉంది. డెరైక్టర్ జనరల్ ఆఫ్ రీసెటిల్మెంట్ (DGR), ఇండియన్ నేవల్ ప్లేస్మెంట్ ఏజెన్సీ (INPA), ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్లేస్మెంట్ ఏజెన్సీ (IAFPA) మరియు ఆర్మీ వెల్ఫేర్ప్లేస్మెంట్ ఆర్గనైజేషన్ (AWPO) ద్వారా దేశంలోని మిలటరీ వెటరన్లతో అమెజాన్ ఇండియా ఆపరేషన్స్ భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. సంజీవ్ వంటి సైనిక అనుభవజ్ఞులకు వారి సెకండ్ కెరీర్లో రాణించేందుకు ఏకైక అతిపెద్ద కారణం ట్రాన్సిషన్. సరిహద్దులో లేదా అమెజాన్‌లో ప్రజలకు సేవ చేయడం మరియు డెలివరింగ్ స్మైల్స్ను అందించడంపై వారి దృష్టి ఉంటుంది.