Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ ఇంజినీరింగ్ కంపెనీ లెట్స్ మొబిలిటీని సొంతం చేసుకున్నట్లు ప్రీమియం కో-లివింగ్ బ్రాండ్, స్మార్ట్ ఫుడ్ కోర్ట్‌ల నిర్వహణ సంస్థ ఇస్తారా కో లివింగ్ వెల్లడించింది. దీంతో రాబోయే ఆరు నెలల్లో ఇస్తారా యొక్క సాంకేతిక ప్రక్రియలన్నీ కూడా నూతన, మెరుగైన ఫ్రేమ్‌వర్క్ 2.0 ద్వారా నిర్వహించబడతాయని ఆ సంస్థ పేర్కొంది. లెట్స్ మొబిలిటీ అభివద్ధి చేసిన ప్రొప్రైయిటరీ మెషీన్ లెర్నింగ్ ఫ్రేమ్‌వర్క్‌తో తమ కీలకమైన సాంకేతికతను మెరుగుపర్చుకోనున్నట్లు తెలిపింది. తెలంగాణా, తమిళనాడు, కర్నాటక వ్యాప్తంగా వివిధ సంస్థలకు చెందిన 50 ఫుడ్ కోర్ట్స్‌తో ఇస్తారా భాగస్వామ్యం చేసుకుని 1,50,000 మంది అవసరాలను తీర్చుతుందని పేర్కొంది.