Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా (ఎఐ) ఈ వారంతంలో టాటా గ్రూపు చేతుల్లోకి వెళ్లనుందని తెలుస్తోంది. ఈ నెల 27న ఎఐ బ్యాలెన్స్ ఖాతాలను అప్పగించే అవకాశం ఉందని ఓ ప్రభుత్వ సీనియర్ అధికారి తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ వచ్చే రెండు లేదా మూడు రోజుల్లో పూర్తి అయ్యే అవకాశం ఉందన్నారు. గతేడాది అక్టోబర్‌లో బిడ్డింగ్ ప్రక్రియలో ఎఐని రూ.18వేల కోట్ల బిడ్డింగ్‌తో టాటా గ్రూపు స్వాధీనం చేసుకుంది. ఎఐకి సంబంధించి రూ.15,300 కోట్ల రుణభారాన్ని తీసుకోవడంతో పాటు రూ. 2,700 కోట్లు నగదు చెల్లించేలా టాటా గ్రూప్‌లో భాగమైన టాలేస్ ప్రయివేటు లిమిటెడ్ ఆఫర్ చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో 100 శాతం వాటాలు, ఎయిరిండియా ఎస్ఎటిఎస్ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ (ఎఐఎస్ఎటిఎస్)లో 50 శాతం వాటాలు టాటా గ్రూపు చేతుల్లోకి వెళ్లనున్నాయి.