Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : బైజూస్, ప్రపంచ అగ్రగామి ఎడ్ టెక్ కంపెనీ, భారతదేశం అత్యంతగా అభిమానించే స్కూల్ లెర్నింగ్ యాప్ సృష్టికర్త అయిన బైజూస్ భారతదేశ ప్రముఖ గేట్ శిక్షకులతో అత్యంత అడాప్టివ్, ఎంగేజింగ్, ఎఫెక్టివ్ అభ్యసన కార్యక్రమాన్ని అందిస్తోంది. అత్యంత నాణ్యమైన బోధన, కంటెంట్ లతో, లోతైన చర్చలతో అభ్యర్థులకు తోడ్పడుతుంది బైజూస్ ఎగ్జామ్ ప్రెప్. గేట్ ఎగ్జామ్ 2022 ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో జరుగ నుంది. ఈ సందర్భంగా బైజూస్ ఇఎక్స్-ఐఈఎస్ ఆఫీసర్, బైజూస్ ఎగ్జామ్ ప్రెప్ సీనియర్ ఫ్యాకల్టీ సంజయ్ రాఠీ మాట్లాడుతూ, ‘‘గేట్ (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్) అనేది ఇంజినీరింగ్, సైన్స్ లలో అండర్ గ్రాడ్యు యేట్ స్థాయి సబ్జెక్టులలో విద్యార్థుల నాలెడ్జ్ ను, అవగాహనను పరీక్షించేందుకు సరైన మార్గం. ఈ ప్రతిష్టాత్మక పరీక్షలో నెగ్గేందుకు అభ్యర్థులు స్మార్ట్ స్ట్రాటజీని, సరైన ప్రణాళిక, సరైన టెక్నిక్ లను ఉపయోగించాల్సి ఉంటుం ది.చేయాల్సినవి, చేయకూడనివి లాంటి వాటితో సహా చివరి నిమిషం చిట్కాలు కూడా ఈ సందర్భంగా కీలకపాత్ర పోషిస్తాయి’’ అని అన్నారు. గేట్ 2022 కు ప్రిపరేషన్ సందర్భంగా అభ్యర్థులకు ఒత్తిళ్లను తగ్గించే కొన్ని ‘డూస్ అండ్ డోంట్స్’ ఇవి:
- సరైన ఎగ్జామ్ వ్యూహం కలిగిఉండడం: అభ్యర్థులు మొదట ప్రశ్నపత్రాన్ని పూర్తిగా చదవాలి. సులభం గా ఉన్న ప్రశ్నలను మొదటగా అటెంప్ట్ చేయాలి. ఆ తరువాత కష్టంగా ఉన్న ప్రశ్నలను అటెంప్ట్ చేయాలి. సులభమని ఐడెంటిఫై చేసుకున్న ప్రశ్నలకు ఎలాంటి తప్పిదాలు లేకుండా ఆన్సర్ చేయాలి. తదుపరి స్కాన్ లో కష్టంగా ఉన్న వాటిని ప్రయత్నించాలి. బ్లైండ్ గా గెస్ చేయవద్దు.
- మరింత ప్రాక్టీస్, మరిన్ని మార్కులు: మాక్స్, పాత ప్రశ్నపత్రాలను సాల్వ్ చేయడం అనేది మనం ఏ టాపిక్స్ లో బలహీనంగా ఉన్నామో గుర్తించేందుకు తోడ్పడుతుంది. ఎగ్జామ్ లో ఏ తరహా ప్రశ్నలు వస్తాయో కొంచెం అర్థం చేసుకునేందుకు అవి ఉపకరిస్తాయి.
- క్విక్ రివిజన్ : ఎగ్జామ్ కు ముందుగా క్విక్ రివిజన్ కోసం ఫార్మూలా లిస్ట్ ను అభ్యర్థులు సిద్ధంగా ఉంచుకోవాలి. ప్రధాన సబ్జెక్టులను రివైజ్ చేసుకోవడంపై దృష్టి పెట్టాలి. మీరు బాగా ఉన్న విభాగాల్లో మరింత పటిష్ఠం అయ్యేందుకు ఇది తోడ్పడుతుంది.
- సెక్షన్ వారీగా ప్రిపరేషన్: గేట్ ఎగ్జామ్ లో ఇంజినీరింగ్ అండ్ జనరల్ ఆప్టిట్యూడ్ మేథమేటిక్స్ అత్యంత ముఖ్యమైన సెక్షన్. మొత్తం మార్కుల్లో 30 శాతం ఇక్కడే ఉంటాయి. అభ్యర్థులు వెయిటేజ్ గరిష్ఠం గా ఉండే టాపిక్స్ / సెక్షన్లు చదవడంపై దృష్టి పెట్టాలి.
- కొత్త టాపిక్స్ జోలికి అస్సలు వెళ్లొద్దు: కొత్త సబ్జెక్ట్ లేదా కొత్త చాప్టర్ చదివేందుకు ఇది సమయం కాదు. అది మీ పై ఒత్తిడిని, కన్ ఫ్యూజన్ ను మరింత అధికం చేస్తుంది. గేట్ 2022 కు మరి కాస్త రోజుల వ్యవధి మాత్రమే ఉన్నందున, విద్యార్థుల తమ బలాలపై దృష్టి పెట్టాలి. వాటిని పూర్తిగా రివైజ్ చేసుకోవాలి. తద్వారా అప్పటికే బాగా చదివిన సబ్జెక్టుల్లో బాగా స్కోర్ చేయగలుగుతారు.
- ఎగ్జామ్ హాల్ లో నెర్వస్ కావద్దు: మానసిక ఒత్తిడి, భావోద్వేగం కారణంగా తేలిక ప్రశ్నలకు సైతం తప్పుగా సమాధానం ఇచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని తప్పించుకునేందుకు ఒక సులభ మార్గం... ముందుగా ఒక్కలైన్ లో ఉండే బహుళైచ్ఛిక ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. ఆ తరువాత న్యుమరిక ల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. ఇది అభ్యర్థులకు ఆయా ప్రశ్నలను ఎదుర్కోవడంలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
- వర్చువల్ కాలిక్యులేటర్ ను ఉపయోగించడం: క్లిష్ట సమస్యలను చేసేందుకు వర్చువల్ కాలిక్యులేటర్ అవసరమవుతుంది. ముందు నుంచే దానిపై ప్రాక్టీస్ చేయడం మంచిది. ఎగ్జామ్ లో వేగంగా చేసేందుకు ఆ ప్రాక్టీస్ తోడ్పడుతుంది.
- ఆరోగ్యాన్ని పణంగా పెట్టవద్దు: రోజురోజుకు కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం. ఆరోగ్యదాయక జీవనశైలిని పాటించాలి. ఫైబర్, ప్రొటీన్ బాగా ఉండే ఆహారం తీసుకోవాలి. తగినంతగా నీరు తాగాలి. తగినంత సమయం నిద్రపోవాలి. ఇవన్నీ మీరు ఆరోగ్యంగా ఉండేందుకు, ఎగ్జామ్ పై దృష్టి పెట్టేందుకు వీలు కల్పిస్తాయి.