Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఐటి సంస్థ సెరిమోర్భిక్ దేశంలోనే తొలి సారిగా హైదరాబాద్‌లో తన డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. దశాబ్దాలుగా ఐటి పరిశ్రమలో ఉన్న ఈ సంస్థ దాదాపుగా వందకు పైగా పేటెంట్లు కలిగి ఉంది. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఎఐ), మెషీన్ లెర్నింగ్(ఎంఎల్), హై పవర్ కంప్యూటింగ్(హెచ్‌పిసి), ఆటోమోటివ్ ప్రాసెసింగ్, డ్రగ్ డిస్కవరీ, మెటావర్స్ ప్రాసెసింగ్ తదితర వీటన్నింటికీ అనువుగా ఉండే పూర్తిస్థాయి సిలికాన్ సిస్టమ్‌ను అందించే ప్రణాళికలో ఉన్నట్లు వెల్లడించింది. అత్యాధునిక సిలికాన్ జామెట్రీ(టిఎస్ఎంసి 5ఎన్ఎం నోడ్)తో డిజైన్ చేసిన కొత్త ఆర్కిటెక్చర్‌ను రూపొందించినట్లు తెలిపింది. ఇక్కడి కేంద్రంలో సెరిమోర్భిక్ ప్రస్తుతం 150 మందికి ఉపాధి కల్పిస్తోందని.. 2024 చివరి నాటికి 400 మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపింది.