Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ప్రయివేటు జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ ఐసిఐసిఐ లాంబార్డ్ తన మార్కెటింగ్, కార్పొరేట్ కమ్యూనికేషన్స్, సిఎస్ఆర్ విభాగాల హెడ్‌గా షీనా కపూర్‌ను నియమించింది. కంపెనీ చేస్తున్న వినూత్న ప్రయత్నాలకు మొత్తం సంస్థ ప్రయోజనాలను విస్తృతం చేయడంలోనూ, ఇతర పోటీదారులకు ధీటుగా సంస్థ బ్రాండ్‌కు విస్తత ప్రచారం చేయడంలో ఆమె నాయకత్వం వహిస్తుందని ఆ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. మార్కెటింగ్, కార్పోరేట కమ్యూనికేషన్స్ రంగంలో షీనా కపూర్‌కు రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉందని వెల్లడించింది. ఎడెల్వైజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నుంచి షీనా కపూర్ ఐసిఐసిఐ లాంబార్డ్‌లో చేరారు.