Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వినూత్నమైన, అతి తక్కువ వ్యయం కలిగిన మినీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను కలిగిన అగ్రిటెక్ స్టార్టప్ 'అవర్ ఫుడ్' కొత్తగా రూ.45 కోట్లు సమీకరించినట్లు వెల్లడించింది. ఈ ఫండింగ్ రౌండ్‌కు ప్రస్తుత ఇన్వెస్టర్ 3లైన్స్ వెంచర్ క్యాపిటల్‌తో పాటుగా నూతన ఇన్వెస్టర్ సి4డి ఆసియా ఫండ్ నేతత్వం వహించాయి. ఈ నిధులతో తమ కార్యకలాపాలు విస్తరించడంతో పాటుగా తయారీ సామర్థ్యం విస్తరించనున్నట్లు తెలిపింది. వ్యవసాయ ఆహార సరఫరా గొలుసును విస్తతంగా మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది. దాదాపు 1700కు పైగా గ్రామీణ వ్యవస్థాపకులు అవర్ ఫుడ్ ఫార్మర్ ఫ్రాంచైజీ లైసెన్స్‌లు పొందినట్లు తెలిపింది. దేశంలోని 12 రాష్ట్రాల్లో తమ కార్యకలాపాలు సాగుతున్నాయని తెలిపింది.