Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి లాభాల్లో భారీ తగ్గుదల చోటు చేసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ నుంచి డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3) 48 శాతంతో రూ.1,011 కోట్ల లాభాలతో సరిపెట్టుకుంది. కమోడిటీ ధరలు అధికంగా పెరగడం, చిప్‌ల కొరత, సరఫరా చెయిన్‌లో సమస్యలు కంపెనీ ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపాయని సమాచారం. గడిచిన త్రైమాసికంలో 2.40 లక్షల ఖాతాదారులకు వాహనాలను డెలివరీ చేయాల్సి ఉందని తెలిపింది. క్రితం క్యూ3లో కంపెనీ అమ్మకాలు 13 శాతం తగ్గి 4,30,668కి పరిమితమయ్యాయి.