Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : మెక్లారెన్ స్ట్రాటజిక్ వెంచర్స్ (ఎంఎస్‌వి) మొట్టమొదటి కత్రిమ మేథస్సు (ఏఐ) వెంచర్ అట్లాస్ సిలికాన్ చిప్ డిజైన్‌ను విడుదల చేసినట్టు ప్రకటించింది. ఇది అంతర్జాతీయ సెమీకండక్టర్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులను తీసుకురానుందని ఆ సంస్థ పేర్కొంది. ఒకే గూటి కింద డిజైన్, ఐపి, ఉత్పత్తిని తీసుకువచ్చి డిజిటల్ సినర్జీలను సష్టించే సమగ్రమైన పర్యావరణ వ్యవస్థ అట్లాస్ సిలికాన్ అని తెలిపింది. తమ వద్ధి ప్రణాళికల్లో భాగంగా భారతదేశంలో భారీ పెట్టుబడులను పెట్టనున్నట్లు వెల్లడించింది. దీనిలో భాగంగా 2025 నాటికి 300 మిలియన్ డాలర్ల వ్యాపారాన్ని చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. ఇక్కడ 100 ఎఎస్ఐసి ఇంజినీర్లను నియమించుకోనున్నట్లు పేర్కొంది.