Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అత్యంత విలువైన బ్రాండ్‌గా గుర్తింపు
న్యూఢిల్లీ : భారత్‌కు చెందిన ప్రముఖ ఐటి కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్లలో రెండో స్థానంలో నిలిచింది. బ్రాండ్ ఫైనాన్స్ 2022 గ్లోబల్ 500 నివేదిక ప్రకారం.. మొదటి స్థానంలో ఉన్న యాక్సెంచర్ ఉంది. కాగా.. మూడో స్థానంలో ఇన్ఫోసిస్ గుర్తింపు పొందింది. ఈ భారత కంపెనీ గత సంవత్సరం నుంచి 52 శాతం వద్ధితో 12.8 బిలియన్ డాలర్లను నమోదు చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివద్ధి చెందుతున్న ఐటి సేవల బ్రాండ్‌గా నిలిచింది. టిసిఎస్ 16.8 బిలియన్ డాలర్ల విలువ కలిగి ఉంది. 2020 నుంచి భారతీయ బ్రాండ్ల సగటు వద్ధి 51 శాతం పెరిగింది. మార్కెట్ కి అనుగుణంగా ద్వారా క్లౌడ్ సేవలు, టెక్నాలజీ కన్సల్టింగ్, మెషిన్ లెర్నింగ్, కత్రిమ మేధస్సు వంటి సేవలు అందిస్తూ పురోగమిస్తున్నాయి. మరోవైపు అమెరికా కంపెనీల బ్రాండ్ల వద్ది సగటున 7 శాతం తగ్గడం విశేషం.