Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భారతదేశపు డిజిటల్ వాతావరణ వ్యవస్థ ఎదుగుదలను వేగవంతం చేసేందుకు దీర్ఘకాలిక, బహుళ సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకున్నట్టు భారతదేశంలో ప్రధాన కమ్యూనికేషన్స్ సంస్థల్లో ఒకటైన భారతీ ఎయిర్టెల్ (“ఎయిర్టెల్”), గూగుల్ నేడు ప్రకటించాయి. కలిసికట్టుగా ఈ రెండు సంస్థలు కస్టమర్ల అవసరాలు తీర్చేందుకు ఉత్తమమైన ఎండ్-టూ-ఎండ్ ఉత్పత్తులు. కస్టమర్లకు నాణ్యమైన అనుభూతి అందించేందుకు కృషి చేస్తాయి. అలాగే అందుబాటు, యాక్సెస్, డిజిటల్ సమిష్ఠతత్వం వంటి సమస్యలు పరిష్కరించేందుకు తమ అనుభవాన్ని ఉపయోగిస్తాయి.
ఈ భాగస్వామ్యంలో భాగంగా తన వాటా కింద గూగుల్ ఫర్ ఇండియా డిజిటైజేషన్ కింద $ 1 బిలియన్ పెట్టుబడిని గూగుల్ పెట్టనుంది. ఇందులో ఈక్విటీ వాటాతో పాటు రానున్న ఐదేళ్ల కాలంలో పరస్పర ఆమోదయోగ్యంమైన నిబంధనల కింద గుర్తించే సంభావ్య వాణిజ్య ఒప్పందాలకు నిధి ఏర్పాటు కూడా ఉంటుంది. అందులో ఇవి ఉంటాయి:
ఒక్కో షేరుకు రూ.734 చొప్పున ఒక 0 మిలియన్ల వాటా పెట్టుబడి.
వాణిజ్య ఒప్పందాలు అమలు చేసేందుకు 0 మిలియన్ల వరకు. ఇందులో సృజనాత్మక అందుబాటు కార్యక్రమాల ద్వారా కస్టమర్లకు డివైసులు అందించేందుకు ఎయిర్టెల్ చేపడుతున్న కార్యక్రమాలు సహ భారత్‌లో డిజిటల్ వాతావరణ వ్యవస్థ సహ యాక్సెస్ వేగవంతం చేయడం, డిజిటల్ సమిష్ఠితత్వాన్ని పెంచే ఇతర కార్యక్రమాలు ఉంటాయి. నియంత్రణా సంస్థల నుంచి తగిన ఆమోదాలకు ఈ ఒప్పందం లొబడి ఉంటుంది.
డిజిటల్ పరివర్తన ప్రయాణాల్లో ముందుకు వెళ్తున్న కొద్ది, వ్యాపారాలు పరిపుష్ఠం చేసుకునేందుకు కనెక్టెడ్ ఇండియా ప్రాధాన్యతను, అన్ని చోట్ల ఉండే వినియోగదారుల కోసం బలమైన డిజిటల్ వ్యవస్థ నిర్మాణాన్ని రెండు సంస్థలు గుర్తించాయి. సృజనాత్మకత డిజిటల్ సేవల ద్వారా వినియోగదారులు, వ్యాపారాల కోసం ఒక ఒపెన్ టెక్నాలజీ వ్యవస్థ నిర్మించేందుకు రెండు సంస్థలు కట్టుబడి ఉన్నాయి. భారతీయ అవసరాలను తీర్చే ప్రత్యేకమైన పరిష్కారాల సృష్టికి సంయుక్త అన్వేషణ జరపడంతో పాటు విస్తృత శ్రేణి రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించాయి.
సృజనాత్మక అందుబాటు పథకాల ద్వారా నినియోగదారులకు ఆండ్రాయిడ్ ఆధారిత డివైసులు అందించే ఎయిర్టెల్ విస్తృత కార్యక్రమాలపై మొట్టమొదటి వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఎయిర్టెల్, గూగుల్ కలిసి పనిచేస్తాయి. రకరకాల డివైస్ తయారీదారుల భాగస్వామ్యంతో వివిధ ధరల శ్రేణిలో ఉండే స్మార్ట్ఫోన్ల కొనుగోలు అడ్డంకులను తొలగించేందుకు ఉన్న అవకాశాలు అన్వేషించేందుకు రెండు కంపెనీలు కృషి చేస్తాయి.
ఈ విస్తృత వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా 5G, ఇతర ప్రమాణాల కోసం అత్యాధునిక నైపుణ్యాలతో భారతదేశానికి ప్రత్యేకమైన నెటవర్క్ డొమెన్ యూజ్ కేసులను రెండు కంపెనీలు కలిసికట్టుగా సృష్టిస్తాయి. ఎయిర్ టెల్ ఇప్పటికే గూగుల్ 5-G రెడీ ఎవాల్వ్డ్ ప్యాకెట్ కోర్ & సాఫ్ట్వేర్ డిఫైన్డ్ నెట్వర్క్ ఫ్లాట్‌ఫామ్స్ ఉపయోగిస్తోంది. కస్టమర్లకు అద్భుతమైన నెట్వర్క్ అనుభూతి అందించేందుకు గూగుల్ నెట్వర్క్ వర్చువలజైషన్ సొల్యూషన్స్ ఉపయోగాన్ని పెంచేందుకు ఉన్న అవకాశాలు అన్వేషిస్తోంది.
తమ డిజిటల్ పరివర్తన ప్రయాణాలను వేగవంతం చేసేందుకు భారత్‌లో క్లౌడ్ ఎకో సిస్టమ్ రూపకల్పన, ఎదుగుదలపై రెండు కంపెనీలు దృష్టి సారిస్తాయి. ఎంటర్ప్రైజ్ కనెక్టివిటీ ఆఫరింగ్ ద్వారా పది లక్షల చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు ఎయిర్టెల్ సేవలందిస్తోంది. ఈ భాగస్వామ్యం డిజిటల్ స్వీకరణను మరింత వేగవంతం చేస్తుంది.
“సృజనాత్మక ఉత్పత్తుల ద్వారా భారత డిజిటల్ ప్రయోజనాలు పెంచాలనే విషయంలో ఎయిర్టెల్, గూగుల్ రెండు ఒకేలాంటి ఆలోచన కలిగి ఉన్నాయి. భవిష్యత్‌కు సిద్ధంగా ఉండే నెట్వర్క్, డిజిటల్ వేదికలు, చివరి మైలు పంపిణీ, చెల్లింపుల వ్యవస్థ కలిగిన మేము గూగుల్‌తో సన్నిహితంగా పని చేసి భారతదేశ డిజిటల్ వ్యవస్థలో మా విస్తీర్ణం పెంచుకోవాలని చూస్తున్నాం” అన్నారు భారతీ ఎయిర్టెల్ ఛైర్మన్ సునీల్ భారతి మిత్తల్.
“భారతదేశపు డిజిటల్ భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో ఎయిర్టెల్ అగ్రగామిగా ఉంది. కనెక్టివిటీ పెంచి మరింత మంది భారతీయులకు ఇంటర్నెట్ సమాన అందుబాటును విస్తరించేందుకు భాగస్వామిగా నిలుస్తున్నందుకు మాకు గర్వంగా ఉంది. స్మార్ట్ఫోన్ల అందుబాటు పెంచడం, కొత్త వ్యాపార సంస్థలకు కనెక్టివిటీ సపోర్టు పెంచడంతో పాటు కంపెనీల డిజిటల్ పరివర్తన ప్రయాణంలో సాయపడేందుకు గూగుల్ ఫర్ ఇండియా డిజిటైజెషన్ ఫండ్ కృషిని కొనసాగిస్తూ ఎయిర్‌టెల్‌లో మేము వాణిజ్య, ఈక్విటీ పెట్టుబడి పెడుతున్నాం” అన్నారు గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్.