Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారీ పరిమాణంలో తమ కొత్త మేడ్-ఇన్-ఇండియా ఉత్పత్తిని ప్రకటించిన కంపెనీ
ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానున్న కియా కారెన్స్
హైదరాబాద్ : దేశంలో అతి వేగంగా పెరుగుతున్న కారు తయారీదార్లలో ఒకటైన కియా ఇండియా, నేడు తమ మొదటి కస్టమర్ కార్, మూడు వరుసల విశ్రాంతి వాహనం, ద కియా కారెన్స్ ని ఆంధ్రప్రదేశ్, అనంతపురంలో ఉన్న తమ ఆధునిక తయారీ సదుపాయం నుండి ఆరంభించింది. కియా కారెన్స్ అనేది కంపెనీ అందించే కొత్త 'మేడ్-ఇన్-ఇండియా`, ఇది కుటుంబాన్ని రవాణా చేసే ఆధునికమైన మరియు ఎస్ యూవీ యొక్క ఉత్సాహాన్ని కలగలిపి ఆధునిక భారతదేశపు కుటుంబాలు కోసం ఉత్తమమైన విలువగా మరియు విలువ ప్రతిపాదనగా చేసింది. ఇంకా, కియా కారెన్స్ తమ పట్టణంలో కొత్త విభాగాన్ని సృష్టించి మరియు నిర్వచించడానికి సిద్ధంగా ఉంది. భారీ సంఖ్యలో ఉత్పత్తి చేయడానికి ముందు కంపెనీ వివిధ అనుకరణ పరిస్థితులు మరియు బహుళ ప్రాంతాలలో కియా కారెన్స్ ని పరీక్షించింది. భారతదేశంలో కియా కారెన్స్ తయారు చేయబడుతుంది మరియు ఎగుమతి చేయబడుతుంది. డిసెంబర్ లో ప్రపంచ ప్రీమియర్ తరువాత కియా కారెన్స్ ఫిబ్రవరి 2022లో అధికారికంగా ప్రారంభించబడుతుంది.
ఈ సందర్భంగా కియా ఇండియా మేనేజింగ్ డైరక్టర్, సీఈఓ టే-జిన్ పార్క్, మాట్లాడుతూ.. 'మేము అందరం కియాలో ప్రేరణ పొందాము మరియు కియా కారెన్స్ తో, మేము ఆధునిక కస్టమర్ యొక్క అవసరాల్ని అనుసంధానం చేస్తూ పూర్తి కొత్త విలువల ప్రతిపాదనలు తెచ్చాము. ఈ కొత్త ప్రయాణం ఆరంభం గురించి మేము ఎంతో ఉత్తేజం చెందాము. భారతదేశంలో మేము ప్రారంభిస్తున్న నాలుగవ ఉత్పత్తి కియా కారెన్స్. ఆధునిక భారతదేశపు కుటుంబాలతో వాస్తవంగా ప్రతఫలించి మరియు వాటి ప్రాధాన్యతని చూపించడానికి మా బృందాలు నిరంతరం శ్రమించాయి. కస్టమర్లు కియా గురించి ఆలోచించినప్పుడు వారు తరగతిలో ఉత్తమమైన ఫీచర్లు, ఒక విలక్షణమైన డిజైన్ గుర్తింపు మరియు సాటిలేని యాజమాన్యం అనుభవం గురించి ఆశిస్తారు- ఇది కారెన్సో లో నిజంగా ప్రతిఫలిస్తుంది.` అని అన్నారు.
ద కియా కారెన్స్ పెట్రోల్ మరియు డీజిల్ పవర్ ట్రైన్స్ లో, 7 డీసీటీ మరియు 6 ఏటీ సహా బహుళ ట్రాన్స్ మిషన్ ఎంపికలతో లభిస్తోంది. కార్ 66 ఆధునిక ఫీచర్స్, సరళమైన సీటింగ్ ఎంపికలు వంటి ఆధునిక కియా కనక్ట్ యాప్ తో, స్లైడింగ్ రకం సీట్ అండర్ ట్రే, రిట్రాక్టబుల్ సీట్ బ్యాక్ బల్ల, రియర్ డోర్, స్పాట్ ల్యాంప్, ముడవ వరుసలో బాటిల్ మరియు గాడ్జెట్ హోల్డర్ వంటి ఫీచర్లతో లభిస్తోంది. వాహనం మూడవ వరుసలో కావలసినంత చోటుని కేటాయించి, పూర్తి కుటుంబం కారుగా చేసింది. 6 ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్, ఈఎస్ సీ, వీఎస్ఎం, హిల్ అసిస్ట్, డీబీసీ వంటి వాటితో సహా అన్ని ట్రిమ్స్ లో స్టాండర్డ్ గా రోబస్ట్ 10 హై-సేఫ్టీ ప్యాకేజీతో కియా కారెన్స్ లభిస్తూ, భారతదేశపు రహదారులు పై అత్యంత సురక్షితమైన వాహనాలలో ఒకటిగా చేసింది.
కియా ఇండియా 14 జనవరి, 2022న కాబోయే కస్టమర్ల కోసం ప్రీ-బుక్కింగ్స్ ప్రారంభించింది. ఆసక్తి గల కస్టమర్లు తమకు ఇష్టమైన వాహనాన్ని కియా ఇండియా అధికారిక వెబ్ సైట్ www.kia.com/in ద్వారా మరియు కియా ఇండియా వారి ఏవైనా అధికారిక డీలర్ షిప్స్ ద్వారా ఐఎన్ఆర్ 25,000 ఆరంభపు బుక్కింగ్ మొత్తాన్ని చెల్లించి బుక్ చేసుకోవచ్చు. మొదటి 24 గంటలలో 7,738 బుక్కింగ్స్ నమోదు చేసి మార్కెట్ నుండి ద కియా కారెన్స్ ఇప్పటికే అనూహ్యమైన ప్రతిస్పందన అందుకుంది.