Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెన్సెక్స్ 814 పాయింట్ల వృద్థి
ముంబయి : ఆర్థిక సర్వే -2022 ఉత్సాహంలో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను నమోదు చేశాయి. సోమవారం కొనుగోళ్ల మద్దతుతో బిఎస్ఇ సెన్సెక్స్ 814 పాయింట్లు పెరిగి 58,014కు చేరింది. ఇంట్రాడేలో వెయ్యి పాయింట్లు ఎగిసింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 238 పాయింట్లు లాభపడి 17,340 వద్ద ముగిసింది. బిఎస్ఇలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.7 శాతం, 0.9 శాతం చొప్పున పెరిగాయి. కోవిడ్ ఒత్తిడిలోనూ 2022-23లో జిడిపి 8-8.5 శాతం పెరుగొచ్చన్న అంచనాలు ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని నింపాయని ఇక్రా చీఫ్ ఎకనామిస్ట్ అదితి నయర్ పేర్కొన్నారు. అంతర్జాతీయ సానుకూల సాంకేతలకు తోడు కేంద్ర బడ్జెట్‌కు ముందు పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో 2021-22 ఏడాదికి జిడిపి వద్ధి 9.2శాతంగా ఉంటుందనే అంచనాలు కలిసివచ్చాయి. ఆర్థిక కార్యకలాపాలు కరోనా పూర్వస్థితికి చేరుకున్నాయని తెలపడం వంటి అంశాలు మదుపర్లను కొనుగోళ్లకు మొగ్గు చూపేలా చేశాయని బ్రోకర్లు తెలిపారు.